కవితకు గల్ఫ్ బోర్డ్ ఏర్పాటు చెయ్యాలని వినపత్రం అందించిన కార్మిక సంఘాల నాయకులు
- December 06, 2020
హైదరాబాద్:గల్ఫ్ దేశాలలో పని చేస్తున్న తెలంగాణ ప్రవాసీయుల కోసం గల్ఫ్ బోర్డ్ అతి త్వరగా ఏర్పాటు చెయ్యాలని ఇదివరకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్య నాయక వర్గం అయిన కల్వకుంట్ల కవిత(ఎం.యల్.సి) ,రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, పార్లమెంటు సభ్యుడు రాష్ట్ర మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి,పార్లమెంటు సభ్యుడు బి.బి.పాటిల్ మొదలగు వారిని కలిసి బడ్జెట్ తో కూడిన బోర్డు ఏర్పాటు చెయ్యాలని కోరారు.దాంట్లో ముఖ్యం గా చనిపోయిన కుటుంబాలకు ఎక్స్గ్రేషియా , సురక్షిత వలసలకు , విదేశాల్లో వివిధ కారణాలతో ఇరుక్కున్న వారిని రప్పించడం , తిరిగి వచ్చిన వారికి ఉపాధి , వైద్య విద్య హామీలు, భీమా పధకాల మీద , నైపుణ్యత అభివృద్ధి మీద దృష్టి పెట్టాలని, మోసాలను అరికట్టి వారికి కఠిన శిక్షలు జరిమానాలు విధించాలని తెలుపగా నాయకులు సానుకూలంగా స్పందించారు.
కవితని కలిసిన వారిలో కోటపాటి అధ్యక్షతన గల్ఫ్ JAC కు సంబంధించిన వివిధ సంఘాల నాయకులు సంపత్ దాసరి, గుగ్గిల్ల రవి గౌడ్, కోటపాటి నరసింహ నాయుడు, ఏముల రమేష్ ,జనగామ శ్రీనివాస్, గంగుల మురళీధర్ రెడ్డి, జంగం బాలకిషన్ మరియు పరికిపండ్ల స్వదేష్ తదితరులు ఉన్నారు.అవసరమున్న చోట ప్రభుత్వానికి తమ సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని సంఘాల నాయకులు తెలియజేసారు.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష