టీ20 సిరీస్ భారత్ కైవసం..
- December 06, 2020
సిడ్నీ:టీమిండియా అద్భుతమైన పోరాటం ఫలించింది. ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్లో విరాట్ కోహ్లీ సారథ్యంలో భారత క్రికెట్ జట్టు అద్భుత ప్రదర్శన చేసింది. ఆదివారం సిడ్నీ వేదికగా జరిగిన రెండో టీ20లో భారత్ 6 వికెట్ల తేడాతో ఘన సాధించింది. దీంతో మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ను మరో మ్యాచ్ మిగిలుండగానే భారత్ 2-0తో కైవసం చేసుకున్నది. సూపర్ ఫామ్లో ఉన్న ఆల్రౌండర్ హార్దిక్ పాండ్య కేవలం 22 బంతుల్లో 42 పరుగులు చేశాడు. 3ఫోర్లు, 2సిక్సర్లతో వీరవిహారం చేయడంతో టీమిండియా 2 బంతులు మిగిలుండగానే టార్గెట్ను ఛేదించింది.
195 పరుగుల భారీ టార్గెట్తో బరిలోకి దిగిన టీమిండియా… నాలుగు వికెట్లు కోల్పోయి 19.4 ఓవర్లలోనే ఛేదించింది. డేనియల్ సామ్స్ బౌలింగ్లో రెండు సిక్సర్లు సాధించి హార్దిక్ (42) జట్టుకు విజయాన్ని అందించాడు. దీంతో కోహ్లీ సేన మరో మ్యాచ్ మిగిలుండగానే టీ20 సిరీస్ కైవసం చేసుకుంది.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు