‘క్రాక్’ గోవా షెడ్యూల్‌ పూర్తి

- December 06, 2020 , by Maagulf
‘క్రాక్’ గోవా షెడ్యూల్‌ పూర్తి

గోవా:మాస్ మహారాజ్ రవితేజ నటిస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ "క్రాక్". ఇందులో రవితేజ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నాడు. శ్రుతి హసన్ ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది. ఇటీవ‌లే ఓ ల‌వ్ రొమాంటిక్ సాంగ్ షూటింగ్ కోసం ర‌వితేజ అండ్ టీం గోవాకు చెక్కేసిన విష‌యం తెలిసిందే. ఎస్ థ‌మ‌న్ మ్యూజిక్ కంపోజిష‌న్ లో వ‌చ్చే సాంగ్ ను ప్ర‌స్తుతం ర‌వితేజ-శృతిహాస‌న్ ల‌పై షూట్ చేశారు.

తాజాగా ‘క్రాక్‌’ సినిమా గోవా షెడ్యూల్‌ పూర్తయింది. సినిమా చిత్రీకరణ ఎంతో సరదాగా జరిగిందని రవితేజ ట్వీట్ చేశారు. ఈ సినిమాను సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాతో పాటు రవితేజ రమేష్ వర్మ డైరెక్షన్ లో ఓ సినిమా చేస్తున్నాడు.

‘డాన్‌శీను, బలుపు’ వంటి హిట్‌ చిత్రాల తర్వాత హీరో రవితేజ – డైరెక్టర్‌ గోపీచంద్‌ మలినేని కాంబినేషన్‌లో వస్తున్న సినిమా కావడంతో ‘క్రాక్‌’పై అంచనాలు పెరిగాయి. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com