ఫ్లై దుబాయ్ ప్రయాణికులకు ఉచితంగా ఇన్సూరెన్స్
- December 06, 2020
దుబాయ్:దుబాయ్ ఆధారిత ఫ్లై దుబాయ్ ప్రయాణికులకు కొత్త 'మల్టీ-రిస్క్ ట్రావెల్ ఇన్సూరెన్స్'ను అందిస్తోంది.ప్రయాణికులు డిసెంబర్ 1 నుండి కొనుగోలు చేసిన టికెట్లకు ఈ ఆఫర్ వర్తిస్తుంది.
ప్రయాణీకులు అదనపు ఖర్చు లేకుండా AIG ట్రావెల్ అందించే భీమాను స్వీకరిస్తారు. ఈ భీమా ప్రయాణానికి సంబంధించి కోవిడ్ -19 కవర్‌ను కూడా అందిస్తుంది అని ఎయిర్‌లైన్స్ ఒక ప్రకటనలో తెలిపింది.
ఫ్లై దుబాయ్ చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ హమద్ ఒబైదల్లా మాట్లాడుతూ 'మా ప్రయాణీకులు మరియు సిబ్బంది భద్రత మరియు శ్రేయస్సు మా అత్యధిక ప్రాధాన్యతగా ఉందని తెలిపారు'.
మా 'మల్టీ-రిస్క్ ట్రావెల్ ఇన్సూరెన్స్' ప్రయాణీకులకు వారి ప్రయాణంలో అడుగడుగునా చూసుకుంటుందని తెలుసుకొని, నమ్మకంగా ప్రయాణించడానికి మరింత విశ్వాసం ఇస్తుంది.రాబోయే శీతాకాల సెలవుల కాలంలో ప్రయాణానికి డిమాండ్ పెరుగుతుందని మేము ఆశిస్తున్నాము మరియు ఇది మా ప్రయాణీకులకు ఎక్కువ సంతోషాన్నిస్తుంది తెలియజేసారు.
తాజా వార్తలు
- సౌదీలో అక్రమ నివాసితులపై ఉక్కుపాదం.. వారంలో దాదాపు 15 వేల మంది అరెస్ట్..!!
- అక్రమ బరువు తగ్గించే మందులపై యూఏఈ ఉక్కుపాదం..!!
- ఒమన్ రియల్ ఎస్టేట్ రంగంలో కీలక సంస్కరణలు..!!
- కువైట్‌లో కల్తీ చేపలపై ఫుడ్ అథారిటీ కొరడా..!!
- ఖతార్‌లో సముద్ర రవాణా సేవలు పునరుద్ధరణ..!!
- భారత్, బహ్రెయిన్ మధ్య న్యాయ సహకారానికి కొత్త దిశ..!!
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్‌గా చాట్‌జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్‌ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’







