‘క్రాక్’ గోవా షెడ్యూల్ పూర్తి
- December 06, 2020
గోవా:మాస్ మహారాజ్ రవితేజ నటిస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ "క్రాక్". ఇందులో రవితేజ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నాడు. శ్రుతి హసన్ ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది. ఇటీవలే ఓ లవ్ రొమాంటిక్ సాంగ్ షూటింగ్ కోసం రవితేజ అండ్ టీం గోవాకు చెక్కేసిన విషయం తెలిసిందే. ఎస్ థమన్ మ్యూజిక్ కంపోజిషన్ లో వచ్చే సాంగ్ ను ప్రస్తుతం రవితేజ-శృతిహాసన్ లపై షూట్ చేశారు.
తాజాగా ‘క్రాక్’ సినిమా గోవా షెడ్యూల్ పూర్తయింది. సినిమా చిత్రీకరణ ఎంతో సరదాగా జరిగిందని రవితేజ ట్వీట్ చేశారు. ఈ సినిమాను సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాతో పాటు రవితేజ రమేష్ వర్మ డైరెక్షన్ లో ఓ సినిమా చేస్తున్నాడు.
‘డాన్‌శీను, బలుపు’ వంటి హిట్ చిత్రాల తర్వాత హీరో రవితేజ – డైరెక్టర్ గోపీచంద్ మలినేని కాంబినేషన్లో వస్తున్న సినిమా కావడంతో ‘క్రాక్’పై అంచనాలు పెరిగాయి.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు