స్టార్ డైరెక్టర్ హరీశ్ శంకర్ చేతుల మీదుగా విడుదలైన ఐఐటి కృష్ణమూర్తి ట్రైలర్
- December 06, 2020
హైదరాబాద్:క్రిస్టోలైట్ మీడియా క్రియేషన్స్, అక్కి ఆర్ట్స్ బ్యానర్లు పై మ్యాంగో మాస్ మీడియా సమర్పణలో నూతన తారలు పృధ్వీ దండమూడి, మైరా దోషి జంటగా నటించిన చిత్రం ఐఐటి కృష్ణ మూర్తి. ఈ సినిమాతో శ్రీ వర్ధన్ దర్శకుడిగా తెలుగు చిత్ర సీమకు పరిచయం అవుతున్నారు. ప్రముఖ పారిశ్రామికవేత్త ప్రసాద్ నేకూరి నిర్మించిన ఈ సినిమా డిసెంబర్ 10న ప్రముఖ ఓటిటి వేదిక అమెజాన్ ప్రైమ్ వీడియోలో డైరెక్ట్ ఓటిటి రిలీజ్ పద్ధతిలో విడుదల అవ్వబోతుంది. ఐఐటి కృష్ణమూర్తి అనే అనే టైటిల్ క్యాచీగా ఉండటంతో ఈ సినిమా పై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో ఇటీవలే విడుదల చేసిన ఐఐటి కృష్ణమూర్తి టీజర్ కు, పాటలకు సోషల్ మీడియాలో విశేషాదరణ లభిస్తోంది. ప్రముఖ దర్శకుడు, స్టార్ ఫిల్మ్ మేకర్ హరీశ్ శంకర్ తాజాగా ఐఐటి కృష్ణ మూర్తి ట్రైలర్ ని తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా విడుదల చేసి చిత్ర బృందానికి శుభాబినందనలు తెలిపారు. ఐఐటి కృష్ణ మూర్తి కచ్ఛితంగా ప్రక్షకుల్ని అలరిస్తోందని ట్విట్ చేశారు హరీశ్ శంకర్. దర్శకుడు శ్రీవర్ధన్ ఈ చిత్రాన్ని యూత్ ఫుల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా రూపొందించినట్లుగా నిర్మాత ప్రసాద్ నేకూరి తెలిపారు. ఈ సినిమాలో ప్రముఖ కమీడియన్ సత్య, వినయ్ వర్మ, బెనర్జీ తదితరలు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి నరేశ్ కుమారన్ సంగీతాన్ని అందించారు, అక్కి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు
తారాగణం
పృధ్వీ దండమూడి, మైరా దోషి, సత్య, వినయ్ వర్మ, బెనర్జీ తదితరులు
సాంకేతిక వర్గం
బ్యానర్ - క్రిస్టోలైట్ మీడియా క్రియేషన్స్, అక్కి ఆర్ట్స్
నిర్మాత - ప్రసాద్ నేకూరి
కెమెరా - ఏసు
ఎడిటింగ్ - అనిల్ కుమార్ పి
మ్యూజిక్ - నరేశ్ కుమారన్
సహనిర్మాత - అక్కి
స్క్రీన్ ప్లే, దర్శకత్వం - శ్రీవర్ధన్
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు