తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసుల రికవరీ శాతం..
- December 07, 2020
హైదరాబాద్:తెలంగాణలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 517 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీనితో రాష్ట్రంలో మొత్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,73,858కి చేరింది. ఇందులో 7,778 యాక్టివ్ కేసులు ఉండగా.. 2,64,606 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. అటు గడిచిన 24 గంటల్లో 862 మంది వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ కాగా, 2 మంది మరణించారు. దీనితో రాష్ట్రవ్యాప్తంగా మృతుల సంఖ్య 1474కి చేరింది. ఇక నిన్న ఒక్క రోజే 33,098 శాంపిల్స్ పరీక్షించగా.. మొత్తంగా టెస్టుల సంఖ్య 58,12,588కి చేరింది.
జిల్లాల వారీగా కేసుల వివరాలు ఇలా ఉన్నాయి.. ఆదిలాబాద్ 10, భద్రాద్రి కొత్తగూడెం 26, జీహెచ్ఎంసీ 102, జగిత్యాల 19, జనగాం 17, జయశంకర్ భూపాలపల్లి 7, గద్వాల్ 1, కామారెడ్డి 0, కరీంనగర్ 33, ఖమ్మం 16, ఆసిఫాబాద్ 2, మహబూబ్ నగర్ 11, మహబూబాబాద్ 06, మంచిర్యాల 15, మెదక్ 7, మేడ్చల్ 36, ములుగు 7, నాగర్ కర్నూల్ 14, నల్గొండ 15, నారాయణపేట 0, నిర్మల్ 02, నిజామాబాద్ 10, పెద్దపల్లి 7, రాజన్న సిరిసిల్ల 5, రంగారెడ్డి 57, సంగారెడ్డి 21, సిద్ధిపేట 11, సూర్యాపేట 07, వికారాబాద్ 09, వనపర్తి 03, వరంగల్ రూరల్ 07, వరంగల్ అర్బన్ 28, యదాద్రి భునగిరిలో 06 కేసులు నమోదయ్యాయి.
--హరి(మాగల్ఫ్ ప్రతినిధి,తెలంగాణ)
తాజా వార్తలు
- కార్మిక సరఫరా ఏజెన్సీ లైసెన్స్ రద్దు సర్వీస్ డిజిటలైజ్: LMRA
- ఇరాన్ డిప్యూటీ అంబాసిడర్‌ను పిలిపించి, నిరసన తెలిపిన ఖతార్..!!
- యూఏఈ లాటరీ.. రెండవ Dh30 మిలియన్ల జాక్‌పాట్ విజేత భారతీయుడు..!!
- అల్ వుస్తాలో నలుగురు ఆసియా జాతీయులు అరెస్టు..!!
- అల్-సల్మీ ఎడారిలో పూడ్చిపెట్టిన భారతీయ ప్రవాసి మృతదేహం లభ్యం..!!
- యూనిఫైడ్ నేషనల్ వీసా ప్లాట్‌ఫామ్‌కు కేబినెట్ ఆమోదం..!!
- ఫేక్ డాక్యుమెంట్లతో సిమ్ తీసుకుంటే జైలే..!!
- నకిలీ ‘కన్స్యూమర్ ప్రొటెక్షన్’ లింక్‌ల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్వ్ సంస్థకు 4 మిలియన్ డాలర్ల కమిట్మెంట్
- అమరావతిలో మరో ఐకానిక్ నిర్మాణం APNRT టవర్!







