పేషెంట్లను చీటింగ్‌ చేసిన డాక్టర్‌ అరెస్ట్‌

- December 07, 2020 , by Maagulf
పేషెంట్లను చీటింగ్‌ చేసిన డాక్టర్‌ అరెస్ట్‌

మనామా‌:బహ్రెయిన్‌లో ఓ డాక్టర్‌ని పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. సల్మానియా మెడికల్‌ కాంప్లెక్స్‌లో శస్త్ర చికిత్సలు నిర్వహించి, పేషెంట్ల నుంచి డబ్బుల్ని తీసుకుంటున్నట్లు నిందితుడైన డాక్టర్‌పై అభియోగాలు మోపబడ్డాయి. సాధారణంగా సల్మానియా మెడికల్‌ కాంప్లెక్స్‌లో వైద్యం పౌరులకు ఉచితం. అత్యవసర విచారణ కింద పబ్లిక్‌ ప్రాసిక్యూషన్‌, నిందితుడైన డాక్టర్‌ని కోర్టుకు రిఫర్‌ చేయగా, ఆ విచారణ మంగళవారం ప్రారంభం కానుంది. ఓ ప్రైవేటు ఆసుపత్రిలో కన్సల్టెంట్‌గా కూడా పనిచేస్తున్న సదరు డాక్టర్‌ అక్కడి నుంచి పేషంట్లను సల్మానియా ఆసుపత్రికి తరలించి, శస్త్ర చికిత్సలు నిర్వహిస్తున్నారు. బహ్రెయిన్‌లో 1960 నుంచి యూనివర్సల్‌ హెల్త్‌ కేర్‌ సిస్టమ్‌ అందుబాటులో వుంది. బహ్రెయినీలకు ఉచితంగా, నాన్‌ బహ్రెయినీలకు సబ్సిడీపై వైద్య చికిత్సను సల్మానియా మెడికల్‌ కాంప్లెక్స్‌లో అందిస్తున్నారు. కాగా, నిందితుడైన డాక్టర్‌ బ్యాంకు అకౌంట్లను సీజ్‌ చేశారు. ఇదిలా వుంటే, 1000, 1,500 బహ్రెయినీ దినార్స్‌ వరకు ఒక్కో రోగి నుంచీ వైద్యుడు వసూలు చేసినట్లు అధికారులు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com