కోవిడ్ భద్రతా నిబంధనలు: కెమెరాలతో పర్యవేక్షణ
- December 07, 2020
దుబాయ్:దుబాయ్ రోడ్స్ అండ్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ 18 నెలల క్రితం ఏర్పాటు చేసిన కెమెరాల్ని, కరోనా సేఫ్టీ రూల్స్ విషయమై పర్యవేక్షణ కోసం ఉపయోగపడుతున్నాయి. ఈ స్మార్ట్ కెమెరాల ద్వారా, మాస్క్‌లను ఎవరైనా ధరిస్తున్నారా.? లేదా.? అన్న విషయాన్ని పరిశీలిస్తారు. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ విధానం ద్వారా మాస్క్‌లు ధరించనివారిని గుర్తించడం జరుగుతుంది. మాస్క్ పెట్టుకోనివారిని గుర్తించి, అధికారుల్ని అప్రమత్తం చేయడం ఈ స్మార్ట్ కెమెరాల బాధ్యత. ఆయా వ్యక్తుల్ని అధికారులు గుర్తించి, తగిన చర్యలు తీసుకుంటారు. సెకెనులో 30 ఫ్రేమ్‌లు తీయగలగడం ఈ కెమెరాల ప్రత్యేకత. ఏడు మీటర్ల రేంజ్‌లో వీటిని తీస్తారు. 65 డిగ్రీల కోణంలో ఫొటోల్ని సేకరించడం జరుగుతుంది.
తాజా వార్తలు
- బహ్రెయిన్, కువైట్ పై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన జీసీసీ
- పోస్టాఫీస్ అదిరిపోయే స్కీమ్..
- మోదీ పర్యటనకు ఘన ముగింపు..యుద్ధ విమానాలతో ఇండోనేషియా వీడ్కోలు
- నాగ్‌పూర్ విమానాశ్రయానికి బహుళ దశల విస్తరణ ప్రణాళికను ఆవిష్కరించిన GMR ఎయిర్‌పోర్ట్స్
- పీఎఫ్ ఖాతాదారులకు ఊరట..
- 45 పైసలకే రూ. 10 లక్షల బీమా.. IRCTC టికెట్ బుకింగ్‌లో అద్భుత ఆఫర్!
- సోషల్ మీడియా ట్రాప్.. దాడి, దోపిడీ చేసిన 9 మంది అరెస్ట్..!!
- కువైట్‌లో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ పర్యటన..!!
- దోహాలో ఎలక్ట్రిక్ రోబో-టాక్సీల ట్రయల్ రన్ పూర్తి..త్వరలో రెండో దశ..!!
- FIFA క్వార్టర్ ఫైనల్స్ షెడ్యూల్ ఇదీ!







