ఏలూరు ప్రజలకు అసలు ఏమైంది..

- December 07, 2020 , by Maagulf
ఏలూరు ప్రజలకు అసలు ఏమైంది..

ఏలూరు ప్రజలకు ఏం జరుగుతోందో అర్థం కావట్లేదు.. ఎందుకలా ఉన్నట్టుండి కళ్లు బైర్లు కమ్మినట్టై కిందపడిపోతున్నారో తెలియట్లేదు. వైద్యులకు అంతు చిక్కని వ్యాధి ఏదో ఏలూరు ప్రజలను కబళిస్తోంది.. ఇప్పటికే కొన్ని తీవ్రలక్షణాలతో ఒకరు మరణించారు. మరో 315 మంది పైగా మహిళలు, చిన్నారులు ఇక్కడి ప్రభుత్వ ఆస్పత్రి (జిజిహెచ్)లో జాయిన్ అయ్యారు. రోగుల సంఖ్య శనివారం అర్థరాత్రి 55 మంది నుంచి ఆదివారం ఉదయానికి 170కి చేరుకుంది. ఇక ఆదివారం సాయింత్రం నుంచి అర్థరాత్రికి వీరి సంఖ్య 315 కు పెరిగింది. వివిధ ప్రైవేటు ఆసుపత్రులలో మరో 50 మంది చికిత్స పొందుతున్నారని నివేదికలు తెలిపాయి.

రోగులు మైకము, తలనొప్పి, మూర్ఛ వంటి లక్షణాలతో ఆస్పత్రులకు వస్తున్నట్లు వైద్యులు వివరిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com