ఎట్టకేలకు అలియా మొదలు పెట్టింది !
- December 07, 2020
దర్శకధీరుడు రాజమౌళి ప్రస్తుతం రామ్ చరణ్ ఎన్టీఆర్ హీరోలుగా ఆర్.ఆర్.ఆర్ అనే సినిమా చేస్తున్నాడు. బాహుబలి ఫ్రాంచైస్ తర్వాత అదే రేంజ్ లో తీస్తున్న సినిమా కావడంతో ఈ సినిమా మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. అదీ కాక టాలీవుడ్ లో రెండు బడా ఫ్యామిలీలకు చెందిన కుర్ర హీరోలు ఇద్దరూ కలిసి నటిస్తుండడంతో ఈ సినిమా మీద అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. దాదాపు 400 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న ఈ సినిమాని ఏకకాలంలో తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో రిలీజ్ చేయడానికి జక్కన్న ప్లాన్ చేశాడు.
అందుకు తగ్గట్టుగానే ఆయా భాషలకు చెందిన కీలక నటులను ఈ సినిమాలో నటింప చేస్తున్నాడు. ముఖ్యంగా బాలీవుడ్ విషయానికి వస్తే అక్కడి స్టార్ హీరో అజయ్ దేవగన్ అలానే హీరోయిన్ అలియా భట్ లను ఈ సినిమాలో నటింపచేస్తున్నారు. ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన హీరోయిన్ గా ఆమె నటిస్తోంది. అయితే ఈ సినిమా షూటింగ్ లో ఇప్పటి దాకా ఆమె పాల్గొనలేదు. నవంబర్ మొదట్లోనే ఈమె షూటింగ్ లో పాల్గొంటుందని భావించినా ఆమె వేరే సినిమాల్లో బిజీగా ఉండి ఈ సినిమా షూటింగ్ కి హాజరు కాలేదు. తాజాగా ఆమె ఈ షూటింగ్ కి హాజరు కాబోతున్నట్లు తన సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది.
నిన్న ఆమె ముంబై నుంచి హైదరాబాద్ కు వస్తున్నట్లు తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ ద్వారా వెల్లడించింది. నేడు రాజమౌళి తో ఫోటోలు దిగి షేర్ చేసేసరికి అందరికి ఒక్కసారిగా నూతన ఉత్తేజం చేకూరింది. నిజానికి కరోనా వైరస్ కారణంగా ఈ సినిమా ఏడు నెలల పాటు ఆగిపోయింది. అక్టోబర్ 5న ఈ సినిమా షూటింగ్ ఎన్టీఆర్ రామ్ చరణ్ లను పెట్టీ మొదలు పెట్టినా ఈమె మాత్రం షూట్ లో పాల్గొనలేదు. ఎట్టకేలకు ఆమె హైదరాబాద్ చేరడంతో ఇక చరణ్ ఫ్యాన్స్ టెన్షన్ తీరినట్లు అయింది.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు