శాస్త్రవేత్తను రిమోట్ గన్‌తో కాల్చి చంపారు..వారిపై కోపంతో ఊగిపోతున్న ఇరాన్
- December 07, 2020
టెహ్రాన్: తమ శాస్త్రవేత్తను రిమోట్ కంట్రోల్ గన్ వాడి చంపారని ఇరాన్ అధికారులు అన్నారు. అయితే ఇటీవల ఇరాన్ న్యూక్లియర్ శాస్త్రవేత్త మోహ్‌సెన్ ఫఖ్రిజాదే మరణించిన విషయం తెలిసిందే. అయితే దానికి యూఎస్, ఇజ్రాయిల్‌లే కారణమని ఇరాన్ అన్నది. తమ దేశ హక్కుల కోసం పోరాడేందుకు ఎంతవరకైనా వెళతామని ఇరాన్ వారు తెలిపారు. అంతేకాకుండా ఈ దేశాలు తమ సాహసోపేత పద్దతులు తమ వద్దనే ఉంచుకోవాలని అప్పట్లో ప్రకటించింది. అయితే ఈ విషయం పై ఇరాన్ మరో కొత్త విషయం బయటపెట్టింది. తమ శాస్త్రవేత్త శాటిలైటు ద్వారా కంట్రోల్ చేయబడే మిషన్ గన్ ద్వారా చంపబడ్డాడని తెలిపింది. దానికి ఆర్టిఫీషియల్ ఇంటెలిజన్స్ గన్‌ను వాడారని ఇరాన్ డిప్యూటీ కమాండర్ తెలిపారు. 'మోహ్‌సెన్ తన కారులో దేశ రాజధాని టెహ్రాన్ బయట రహదారిలో వెళుతున్నాడు. అప్పటికీ అతను దాదాపు 11మంది గార్డులతో వెళ్లారు. అప్పుడే కారులో ఉన్న అతనిపై మిషన్ గన్ జూమ్ అయ్యింది. అతని ముఖం ఫోకస్ అయిన వెంటనే 13రౌండ్లు కాల్చింద'ని రియర్ అడ్మిరల్ అలి ఫదావి తెలిపారు.
అంతేకాకుండా ఆ గన్‌ను కేవలం అతడి చంపడానికే అమర్చబడిందని, లేదంటే కేవలం 10 అంగుళాల దూరంలో అతడి పక్కనే ఉన్న అతడి భార్యకు ఏమీ కాలేదని తెలిపారు. ఈ గన్‌ను ఆన్‌లైన్ ద్వారా కంట్రోల్ చేశారు. అంతేకాకుండా టార్గెట్‌ను గుర్తించేందుకు అత్యాధునిక కెమెరా, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌ను వాడారు. ఆ ప్రాంతంలో ఎటువంటి టెర్రరిస్టులు కూడా లేరని అధికారులు తెలిపారు. దీనికి కారణం ఇజ్రాయిల్‌కు చెందిన ముజహదీన్ ఆఫ్ ఇరాన్(ఎంఈకే)నే దీనికి కారణం అని ఇరాన్ అన్నారు.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు