కంగనా నోరు మూయించిన మొదటి వ్యక్తి

- December 07, 2020 , by Maagulf
కంగనా నోరు మూయించిన మొదటి వ్యక్తి

బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ ఏ విషయంలో అయినా నిర్మోహమాటంగా మాట్లాడేస్తూ అవతలి వారు ఎవరు అనే విషయాన్ని కూడా చూడకుండా విమర్శలు చేస్తుంది. ఆమె విమర్శలకు ప్రతి విమర్శలు చేసినా ఆమె వ్యాఖ్యలను ఖండించాలని ప్రయత్నించినా కూడా వారికి కంగనా చుక్కలు చూపిస్తుంది. బాబోయ్ ఎందుకు ఈమెతో పెట్టుకున్నారా బాబు అనుకునేట్లుగా చేస్తుంది. ఇప్పటి వరకు ఈమె వ్యాఖ్యలకు ఎంతో మంది సినీ ప్రముఖులు నోరు మూసుకోవాల్సి వచ్చింది. ఆమెకు కౌంటర్ ఇస్తున్నా కొద్ది రెచ్చి పోయి హద్దు దాటి వ్యాఖ్యలు చేస్తుంది. అందుకే ఆమె గురించి స్పందించేందుకు ఎవరు కూడా ఆసక్తి చూపించరు. అందుకే ఇండస్ట్రీలో ఆమెకు సగం మంది విరోదులు ఉంటారు అంటారు. ఎప్పుడు తనను ఒకటి అంటే అవతలి వారిని రెండు అనేందుకు రెడీగా ఉండే కంగనా ఈసారి మాత్రం కాస్త ఆత్మరక్షణలో పడిపోయింది. కేంద్రం తీసుకు వచ్చిన కొత్త వ్యవసాయ బిల్లులపై రైతులు ఆందోళన చేస్తున్నారు. ఆందోళన చేస్తున్న రైతుల విషయంలో కంగనా విమర్శనాత్మకంగా మాట్లాడింది. ఒక రైతు ను షేర్ చేసి పెయిడ్ ఆర్టిస్టు అన్నట్లుగా వ్యాఖ్యలు చేసింది. ఆమె చేసిన వ్యాఖ్యలకు నటుడు దిల్జిత్ దోసాంజ్ స్పందించాడు.

ఆమె వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించడంతో పాటు ఆమె తీరును కడిగి పారేశాడు. తనను చిన్న మాట అన్నా కూడా పడని కంగనా ఈ విషయంలో మాత్రం ఏమాత్రం స్పందించలేదు. తాను చేసింది తప్పే అన్నట్లుగా ఆమె భావించడం వల్లే దిల్జిత్ కు రెస్పాండ్ అవ్వలేదు. కంగనా నోరు మూయించిన దిల్జిత్ కు సోషల్ మీడియాలో అనూహ్యంగా ఫాలోయింగ్ పెరిగి పోయింది. రైతుల కోసం కోటి రూపాయలు సాయం చేసి షర్టర్స్ ను కూడా ఇవ్వడం తో జనాల్లో రియల్ హీరో అయ్యాడు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com