యూఏఈ వీసా ఉల్లంఘనలు: ఎగ్జిట్‌ ప్రోటోకాల్స్‌ జారీ చేసిన ఐసిఎ

- December 07, 2020 , by Maagulf
యూఏఈ వీసా ఉల్లంఘనలు: ఎగ్జిట్‌ ప్రోటోకాల్స్‌ జారీ చేసిన ఐసిఎ

అబుధాబి:మార్చి 1 కంటే ముందు వీసా గడువు తీరిన వ్యక్తులు ఎవరైతే యూఏఈలో అక్రమంగా నివసిస్తున్నారో, అలాంటివారు డిసెంబర్‌ 31వ తేదీ లోపు దేశం విడిచి వెళ్ళాల్సి వుంటుంది. వారితోపాటు, వారిపై ఆధారపడివున్నవారు కూడా దేశం నుంచి ఎలాంటి జరీమానా లేకుండా వెళ్ళిపోవాలంటే, అందుకు తగ్గ ఏర్పాట్లు డిసెంబర్‌ 31కి ముందే చేసుకోవాల్సి వుంటుంది. యూఏఈ ఫెడరల్‌ అథారిటీ ఫర్‌ ఐడెంటిటీ అండ్‌ సిటిజన్‌ షిప్‌ (ఐసిఎ) వెల్లడించిన వివరాల ప్రకారం, విజిట్‌, టూరిస్ట్‌ లేదా రెసిడెన్సీ వీసాలు మార్చి 1 లోపు గడువు తీరిపోయి, ఆ తర్వాత కరోనా నేపథ్యంలో దేశంలోనే వుండిపోయినవారికి ఇది వర్తిస్తుంది. పాస్‌పోర్ట్‌ లేదా ట్రావెల్‌ డాక్యుమెంట్‌ అలాగే బుక్‌ చేసుకున్న టిక్కెట్‌ని కలిగి, ఎయిర్‌పోర్ట్‌కి నాలుగు గంటల ముందుగా చేరుకోవాల్సి వుంటుంది. లేనిపక్షంలో, వారికి జరీమానా విధించడం జరుగుతుంది. దుబాయ్‌ ఎయిర్‌ పోర్టుల నుంచి వెళితే, దుబాయ్‌ సివిల్‌ ఏవియేషన్‌ సెక్యూరిటీ సెంటర్‌కి 48 గంటల ముందుగా సమాచారం అందించాల్సి వుంటుంది. అబుదాబీ, షార్జా అలాగే రస్‌ అల్‌ ఖైమా ఎయిర్‌ పోర్టుల నుంచి వెళ్ళాల్సి వుంటే, విమానం బయలుదేరడానికి ఆరు గంటల ముందు విమానాశ్రయానికి చేరుకోవాలి. ఒకవేళ ఉల్లంఘనులు, బిజినెస్‌ పార్టనర్‌ లేదా ఇన్వెస్టర్‌ కేటగిరీలకు చెందినవారైతే, కంపెనీని లిక్విడేట్‌ చేయడం లేదా కంపెనీలో తమ లీగల్‌ కెపాసిటీని రద్దు చేసుకోవాల్సి వుంటుంది. పూర్తి వివరాల కోసం ఐసీఏని 800453 నెంబర్‌లో సంప్రదించవచ్చు.  

--ప్రదీప్(మాగల్ఫ్ ప్రతినిధి,అబుధాబి

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com