కువైట్ తిరిగొచ్చే డొమస్టిక్ వర్కర్ల కోసం కొత్త యాప్
- December 07, 2020
కువైట్ సిటీ:పలు దేశాల నుంచి కువైట్ తిరిగొచ్చే డొమస్టిక్ వర్కర్లు, వారి స్పాన్సర్ల కోసం కువైట్ ప్రభుత్వం BelSalamah.com అనే యాప్, వెబ్ సైట్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. డొమస్టిక్ వర్కర్లు తిరిగి వచ్చేందుకు అనుకూలంగా ఆంక్షలు సడలించటంతో దాదాపు 80 వేల మంది కువైట్ చేరుకోవచ్చని ఆ దేశ ప్రభుత్వం అంచనా వేస్తోంది. అయితే..డొమస్టిక్ వర్కర్ల ప్రయాణం, క్వారంటైన్ వ్యవహారాలకు స్పాన్సర్లే చూసుకోవాలని ఇప్పటికే స్పష్టత ఇచ్చిన విషయం తెలసిందే. ప్రస్తుతం అందుబాటులోకి వచ్చిన http://BelSalamah.com ద్వారా స్పాన్సర్ల తమ ఇంట్లో పని చేసే వారి కోసం టికెట్లను బుక్ చేయటం, వారి పీసీఆర్ టెస్ట్, క్వారంటైన్ ఏర్పాట్ల ప్రక్రియను సులభంగా పూర్తి చేయవచ్చు. ఇదిలా ఉంటే కువైట్ చేరుకునే డొమస్టిక్ వర్కర్లు అందరూ....పీసీఆర్ నెగటీవ్ రిపోర్ట్ తో కువైట్ చేరుకోవాలి. ఆ తర్వాత కువైట్ లో రెండో సారి పీసీఆర్ టెస్ట్ నిర్వహిస్తారు. ఆ తర్వాత 270కువైట్ దినార్స్ తో క్వారంటైన్ ప్యాకేజీ(భోజనంతో సహా) బుక్ చేసుకొని క్వారంటైన్ సెంటర్ కు వెళ్లాల్సి ఉంటుంది. 14 రోజుల తర్వాత మళ్లీ మూడోసారి పీసీఆర్ టెస్ట్ చేయించుకోవాల్సి ఉంటుంది. నెగటివ్ రిపోర్ట్ వస్తే వారిని స్పాన్సర్ తీసుకెళ్లవచ్చు. మరోవైపు కువైట్ చేరుకొనే ఛార్టర్ ఫ్లైట్స్ షెడ్యూల్, ప్రయాణ ఛార్జీలకు సంబంధించి డీజీసీఏ వర్కౌట్ చేస్తోంది. ఇండియా నుంచి ప్రయాణం చేసే వారికి 110 కువైట్ దినార్స్ ను విమాన ఛార్జీలుగా నిర్ణయించారు.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- లెబనాన్ పై ఇజ్రాయెల్ బాంబుల వర్షం...
- ఇరాన్ సంచలన నిర్ణయం
- కేంద్ర క్యాబినెట్ కీలక నిర్ణయాలు
- తెలంగాణలో కొత్త ఎయిర్పోర్టులు..కేంద్రం కీలక ప్రకటన
- IPL ఆటగాళ్లకు బీసీసీఐ కొత్త రూల్స్
- ఏవియేషన్ విద్యార్థులకు అంతర్జాతీయ ఇంటర్న్షిప్ అవకాశం
- యూఏఈలో పర్యటించనున్న కేంద్ర మంత్రి జైశంకర్
- సీఎం రేవంత్ రెడ్డితో టాటా లాక్హీడ్ మార్టిన్ ఎండీ భేటీ
- కాగజ్నగర్ రైల్వే బ్రిడ్జి నిర్మాణంలో ప్రమాదం
- అమెరికా-ఇరాన్ కాల్పుల విరమణ..స్వాగతించిన భారత్









