"నీ ప్రవర్తన అనుమానంగా ఉంది..అవినాష్ అన్న మాటలు నిజమే" అంటూ అఖిల్ ని కడిగిపారేసిన బ్యూటీ

- December 08, 2020 , by Maagulf
\

Big Boss Season 4: బిగ్‏బాస్ హౌస్‏లో టికెట్ టూ ఫినాలే లభించిన అఖిల్ చాలా హుషారుగా కనిపిస్తున్నాడు. అటూ హారిక, అరియానాలతో పులిహోర కలుపుతూ తెగ బిజీ అయిపోయాడు. అయితే అరియానా, అఖిల్ మాట్లాడుకుంటుండగా.. మోనాల్ మధ్యలోకి వెళ్ళింది. అవినాష్ మాటలు నిజమే అనిపిస్తున్నాయి. అఖిల్ పులిహోర అని అవినాష్ చెప్పిన మాటలు ఇప్పుడు నిజమనిపిస్తున్నాయంటూ తన అభిప్రాయాన్ని బహటంగా చెప్పింది ఈ గుజరాతీ భామ.

బిగ్‏బాస్ హౌస్‏లోకి ఎంటరయ్యిన దగ్గరనుంచి మోనాల్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తూ వచ్చింది. అయితే షో ప్రారంభంలో అభిజిత్‏కు దగ్గరగా ఉంటూ వచ్చిన ఈ బ్యూటీ, తర్వాత అతను దూరం పెట్టడంతో అఖిల్‏కు దగ్గరైంది. మోనాల్ అఖిల్ మధ్య ఏదో నడుస్తోంది అంటూ నెటిజన్లు తెగ కామెంట్లు చేశారు. కాగా గేమ్ చివరి దశలోకి వచ్చింది. ఇటివల నామినేష్స్ ప్రక్రియలో వీరిద్దరి మధ్య కాస్తా దూరం పెరిగింది. ఈ క్రమంలో అఖిల్.. హారిక, అరియానాలతో ప్రవర్తిస్తూన్న తీరుపై అసహనం వ్యక్తం చేసింది. ఇంత సడెన్‏గా ఇలా మారిపోయారేంటి అని మోనాల్ ప్రశ్నించగా.. ఇది నాలో ఉన్న మరో యాంగిల్.. నేను ఒకరితో మంచిగా ఉంటాను. వాళ్ళు అలా లేకుంటే నా మైండ్ నేను మార్చుకుంటాను అంటూ తిరిగి సమాధానం చెప్పాడు అఖిల్. వెంటనే మోనాల్ నీ ప్రవర్తన నాకు అనుమానంగానే ఉంటుంది. అందుకే ఈ ప్రశ్న వేసా, నువ్వు హారికతోనే కాదు అరియానాతో కూడా క్లోజ్‏గా ఉండూ కానీ నీ ప్రవర్తన చూసి నేను తట్టుకోలేకపోతున్నా. నువ్వు వాళ్ళీద్దరిని హగ్ చేసుకునే తీరు సరిగా లేదు. నీ హగ్స్ వెనక ఏదో స్వార్థం ఉందనే ఫీలింగ్ కలుగుతందని మోనాల్ అసహనం వ్యక్తం చేసింది. దీంతో అఖిల్ కోపంగా ఊరుకో అంటుండగా. ఊరుకో కాదు అంటూ తన మాటలను తెలపడానికి ప్రయత్నించింది మోనాల్.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com