ఎగ్జిట్‌ వీసా ఓవర్‌ స్టేయింగ్‌కి 1,000 సౌదీ రియాల్స్‌ జరీమానా

- December 08, 2020 , by Maagulf
ఎగ్జిట్‌ వీసా ఓవర్‌ స్టేయింగ్‌కి 1,000 సౌదీ రియాల్స్‌ జరీమానా

సౌదీ అరేబియా జనరల్‌ డైరెక్టరేట్‌ ఆఫ్‌ పాస్‌పోర్ట్స్‌, ఎగ్జిట్‌ వీసా ఓవర్‌ స్టేయింగ్‌పై హెచ్చరికలు జారీ చేసింది. ఎగ్జిట్‌ వీసా కలిగి వుండి, ఎక్కువ కాలం నిబంధనలకు విరుద్ధంగా వుంటోన్నవారికి 1,000 సౌదీ రియాల్స్‌ జరీమానా విధించడం జరుగుతుందని ఆ హెచ్చరికల్లో పేర్కొన్నారు. వీసా పొందిన వ్యక్తి, వీసా గడువు తీరినా దేశంలో వుంటే, వీసాని క్యాన్సిల్‌ చేసుకుని, కొత్తది పొందడానికి 1,000 సౌదీ రియాల్స్‌ జరీమానా చెల్లించాల్సి వస్తుందని ట్విట్టర్‌లో పేర్కొన్నారు అధికారులు. వలసదారుడి ఐడెంటిటీ కార్డు చెల్లుబాటయ్యేలా వుంటేనే, ఆ ప్రాసెస్‌ పూర్తి చేయడానికి వీలవుతుంది. ఓ వర్కర్‌ విషయమై ఎగ్జిట్‌ వీసా తన వద్దకు వచ్చిందనీ, రెసిడెన్సీ పర్మిట్‌ కూడా గడువు తీరినా, ఆ వ్యక్తి దేశం విడిచి పోలేదనీ ఓ ఎంప్లాయర్‌ మినిస్ట్రీని ఆశ్రయించడం జరిగింది. దాంతో, మినిస్ట్రీ నుంచీ ఈ స్పందన వచ్చింది. గత నెలలో సౌదీ అరేబియా, మేజర లేబర్‌ రిఫార్మ్స్‌ని తీసుకురావడం జరిగింది. జాబ్‌ మొబిలిటీ, ఎగ్జిట్‌ మరియు రీ-ఎంట్రీ వీసా జారీ (ఎంప్లాయర్స్‌ అప్రూవల్‌ లేని వలస కార్మికుల కోసం) వంటివి ఇందులో ముఖ్యమైనవి. ఈ రిఫార్మ్స్‌ వల్ల లక్షలాది మంది మైగ్రెంట్‌ వర్కర్స్‌ ఉపశమనం పొందారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com