అబుధాబి:జనవరి 2 నుంచి టోల్ గేట్ ఫీజు అమలు
- December 08, 2020
అబుధాబి:అబుధాబిలో బ్రిడ్జి లపై జనవరి 2 నుంచి టోల్ గేట్ ఫీజు అమల్లోకి రానుంది. దీంతో వాహనదారులు అంతా తమ టోల్ గేట్ అకౌంట్లను రిజిస్టర్ చేసుకొని యాక్టివేట్ చేయించుకోవాలని అబుధాబి అధికారులు వెల్లడించారు. https://darb.itc.gov.ae ద్వారాగానీ, డర్బ్ యాప్ ద్వారాగానీ వాహన యజమానులు టోల్ గేట్ అకౌంట్లను యాక్టీవేట్ చేయించుకోవాలని సూచించారు. టోల్ ఛార్జీని Dh4గా నిర్ధారించారు. వాహనదారులు టోల్ గేట్ దాటిన ప్రతిసారి నిర్ణయించిన మొత్తం చెల్లించాల్సి ఉంటుంది. అయితే...అబుధాబిలోని నాలుగు వంతెనలపై వాహనాల రద్దీ ఎక్కువగా ఉన్న సమయాల్లో మాత్రమే డర్బ్ విధానం అమలులో ఉంటుంది. అంటే ఉదయం 7 నుంచి 9 గంటల వరకు, సాయంత్రం 5 నుంచి 7 గంటల వరకు డర్బ్ యాక్టివేట్ అవుతుంది.
--సుమన్(మాగల్ఫ్ ప్రతినిధి,అబుధాబి)
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు