KD22కే పీసీఆర్ టెస్ట్..ప్రయాణికులకు అల్ జజీరా ఎయిర్ వేస్ ఆఫర్
- December 08, 2020
కువైట్ సిటీ:కోవిడ్ వ్యాప్తి నియంత్రణలో భాగంగా...విమాన ప్రయాణికులకు పీసీఆర్ రిపోర్ట్ తప్పనిసరి చేశాయి విమానసంస్థలు. అయితే..ఫ్లైట్ టైంకి నిర్ణీత సమయంలోగా పీసీఆర్ టెస్టు చేయించుకోవాల్సి ఉంటుంది. ఇది కొంత మేర ప్రయాణికులకు అసౌకర్యంగా మారుతోంది. అయితే...అల్ జజీరా ఎయిర్ వేస్ తమ ప్రయాణికులకు కోసం సులభమైన, చౌకైన ఆఫర్ ప్రకటించింది. తమ ప్రయాణికులకు కేవలం 22 కువైట్ దినార్లతో పీసీఆర్ టెస్ట్ చేయనున్నట్లు వెల్లడించింది. ఇందుకోసం కువైట్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆమోదం పొందిన జర్మన్ స్పెషలైజ్డ్ క్లినిక్ తో భాగస్వామ్యం అయినట్లు వివరించింది. పీసీఆర్ టెస్ట్ చేయించుకోవాలనుకునే ప్రయాణికులు అపాయింట్మెంట్ ను ఫ్లైట్ టైంకి తగినట్లుగా షెడ్యూల్ చేసుకోవచ్చు. తమ విమానాల్లో ప్రయాణించే ప్రయాణికులకు సరసమైన ఛార్జీలతో టెస్ట్ సౌలభ్యాన్ని కల్పించటం పట్ల సంతోషిస్తున్నామని అల్ జజీరా ఎయిర్ వేస్ సీఈవో రోహిత్ రామచంద్రన్ అన్నారు. ఇది చాలా మంది ప్రయాణికులకు సులభమైన ప్రయాణికి ఎంతగానో దోహదపడుతుందని అభిప్రాయపడ్డారు. ఫ్లైట్ టికెట్లతో పాటు పీసీఆర్ టెస్ట్ స్లాట్స్ ను http://jazeeraairways.com ద్వారాగానీ, జజీరా యాప్ లేదా కాల్ సెంటర్ నెంబర్ 177కి కాల్ చేసి బుక్ చేసుకోవాలని రోహిత్ వెల్లడించారు.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు