ఏలియన్స్ ఉన్నాయట! ట్రంప్ కు కూడా తెలుసట!
- December 09, 2020
ఇజ్రాయెల్ అంతరిక్ష భద్రత మాజీ చీఫ్ హేమ్ ఇషెద్ గ్రహాంతరవాసుల (ఏలియన్స్) అస్థిత్వంపై సంచల వ్యాఖ్యలు చేశారు. ఏలియన్స్ నిజంగానే ఉన్నాయని, ఆ విషయం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు కూడా తెలుసని అన్నారు. గ్రహాంతరవాసులను అంగీకరించేందుకు మానవుడు ఇప్పుడే సిద్ధంగా లేనందున అమెరికా ఆ విషయాన్ని గోప్యంగా ఉంచుతోందని ఆరోపించారు. హేమ్ ఇషెద్ ఇటీవల ఓ ఇజ్రాయెల్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వూలో మాట్లాడుతూ.. ఏలియన్స్ 'గెలాక్సీ సమాఖ్య'కు, అమెరికా ప్రభుత్వానికి మధ్య ఓ ఒప్పందం కుదిరిందని, విశ్వం రహస్యాలపై పరిశోధనలు జరిపేందుకు అమెరికా వ్యోమగాములు, గ్రహాంతరవాసులతో ఈ ఒప్పందం కుదుర్చుకున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ విషయం ట్రంప్‌కు తెలుసని, అయితే ప్రజలు కంగారు పడతారనే ఉద్దేశంతో దీన్ని బయటకు వెల్లడించలేదని చెప్పారు. అంతరిక్షం, స్పేస్‌షిప్‌ల గురించి మానవులకు పూర్తిగా అర్థమైన తర్వాతే తమ అస్థిత్వం గురించి బయటపెట్టాలని ఏలియన్స్ అమెరికాకు చెప్పినట్లు పేర్కొన్నారు. అయితే ఇషెద్ వ్యాఖ్యలపై అటు అమెరికా ప్రభుత్వం గానీ, ట్రంప్ గానీ ఇంతవరకు స్పందించలేదు. కానీ ఇషెద్ వ్యాఖ్యలు మాత్రం ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు