కరోనా పై జో బిడెన్ 100 రోజల ప్రణాళిక..

- December 09, 2020 , by Maagulf
కరోనా పై జో బిడెన్ 100 రోజల ప్రణాళిక..

జో బిడెన్ తన అధ్యక్ష పదవిలో "మొదటి 100 రోజులలో COVID-19 వ్యాక్సిన్ యొక్క "100 మిలియన్ షాట్లను" పంపిణీ చేస్తానని హామీ ఇచ్చారు.

జనవరిలో డొనాల్డ్ ట్రంప్ నుండి అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించనున్న మిస్టర్ బిడెన్ ఈ మహమ్మారిని అరికట్టేందుకు ప్రవేశపెట్టిన టాస్క్ ఫోర్స్ ను పరిచయం చేస్తూ ఈ ప్రకటన చేశారు. 

100 రోజుల వ్యవధి:
"100 రోజుల్లో, మేము వ్యాధి యొక్క గతిని మార్చగలము. అమెరికాలో జీవితాన్ని మంచిగా మార్చగలము. మీ రాజకీయ దృక్పథం ఏమైనప్పటికీ, 100 రోజులు ఫేస్ మాస్కులు ధరించాలి. ప్రజా రవాణా లో మరియు తమ కార్యాలయాల్లో ఫేస్ మాస్కులు ధరించాలనే తప్పనిసరి నియమాన్ని ప్రవేశపెడతాము" అని ఆయన అన్నారు.

అధ్యక్షుడిగా తన మొదటి 100 రోజులలో "మెజారిటీ" పాఠశాలలను తిరిగి తెరవడానికి వీలుగా వైరస్ నియంత్రణలో ఉందని తాను నమ్ముతున్నానని బిడెన్ చెప్పారు. వైరస్ ను అంతం చేయలేము కానీ దాని తీవ్రత తగ్గించేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తామని హామీ ఇచ్చారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com