డిసెంబర్ 31తో గడువు పూర్తి.. లేదంటే 10,000 జరిమానా

- December 09, 2020 , by Maagulf
డిసెంబర్ 31తో గడువు పూర్తి.. లేదంటే 10,000 జరిమానా

కరోనా వైరస్ నేపథ్యంలో ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ ఐటీఆర్ రిటర్న్స్ దాఖలు గడువును పలుమార్లు పొడిగించుకుంటూ వచ్చింది. అయితే ఈ గడువు డిసెంబర్ 31తో పూర్తవుతుంది. అందువల్ల డిసెంబర్ 31లోపు కచ్చితంగా ఐఆర్‌టీ సమర్పించాల్సి ఉంటుంది. అలా చేయని పక్షంలో రూ.10,000 భారీ జరిమానా విధిస్తారు. రూ.5 లక్షల లోపు ఆదాయం ఉన్నా రూ.1000 ఆలస్య రుసుము కట్టాలి. ఇప్పటి వరకు ఐటీఆర్ దాఖలు చేయని వారు వెంటనే ఆపని పూర్తి చేయండి. లేదంటే ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఇంకా 20 రోజులు ఉంది కదా అని అశ్రద్ధ చేస్తే అప్పుడు ఏదో ఒక అవాంతరం ఎదురు కావచ్చు. అందుకే అలసత్వం వలదు.. రేపటి పని ఈ రోజే పూర్తి చేయడానికి ప్రయత్నించండి.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com