భారత జాతీయులకు ఒమన్‌ వీసా ఫ్రీ ట్రావెల్‌

- December 10, 2020 , by Maagulf
భారత జాతీయులకు ఒమన్‌ వీసా ఫ్రీ ట్రావెల్‌

ఒమాన్: ఒమన్‌కి వెళ్ళి పది రోజులపాటు వుండాలనుకునేవారికి వీసా ఫ్రీ ట్రావెల్‌ అవకాశం కల్పిస్తున్నారు. ఎంట్రీ వీసా అవసరం లేకుండానే ఈ అవకాశం కల్పిస్తోంది ఒమన్‌ ప్రభుత్వం. మొత్తం 103 దేశాలకు ఈ అవకాశం వుండగా, అందులో భారతదేశం కూడా ఒకటి. థాయిలాండ్‌, మలేసియా, సింగపూర్‌, లెబనాన్‌, భూటాన్‌, జోర్డాన్‌, తజకిస్తాన్‌, మకావు, ఇరాన్‌ మరియు బ్రూనై ఇతర ఆసియా దేశాలు ఈ లిస్ట్‌లో వున్నాయి.

--లెనిన్ కుమార్ (మాగల్ఫ్ ప్రతినిధి, ఒమన్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com