బాలికపై అత్యాచారం: పలువురి అరెస్ట్
- December 10, 2020
యూఏఈ: ఓ బాలికపై పలువురు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడిన ఘటనకు సంబంధించి నిందితుల్ని అరెస్ట్ చేయడం జరిగింది. నిందితులు అత్యాచారానికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ వీడియో ఆధారంగా నిందితుల్ని అరెస్ట్ చేసినట్లు అటార్నీ జనరల్ వెల్లడించారు. ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్, ఈ కేసు విచారణ నిమిత్తం అత్యంత వేగవంతంగా చర్యలు తీసుకుంది. నిందితుల్ని ట్రాక్ చేసి, అరెస్ట్ వారెంట్స్ జారీ చేసి, వారిని కొద్ది గంటల్లోనే అరెస్ట్ చేశారు. అటార్నీ జనరల్ డాక్టర్ హమాద్ సైఫ్ అల్ షామ్సి ఈ కేసుని స్వయంగా పర్యవేక్షించారు. ఇలాంటి ఘటన యూఏఈలో చాలా అరుదైనదనీ, అత్యంత బాధాకరమైన ఘటన అనీ అటార్నీ జనరల్ చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లోనూ నిందితుల్ని కఠినంగా శిక్షిస్తామని చెప్పారు. పిల్లల విషయంలో తల్లిదండ్రులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు