పెదనాన్న కోసం ఓ సినిమా
- February 19, 2016
'బాహుబలి 2' పూర్తయ్యేంత వరకూ మరో విషయం గురించి ఆలోచించడం లేదు ప్రభాస్. ఈలోగా ప్రభాస్ కోసం కొత్త కథలు సిద్ధమవుతూనే ఉన్నాయి. అయితే దేనికీ పచ్చజెండా వూపలేదు. 'అన్నీ బాహుబలి తరవాతే' అన్నది ప్రభాస్ ఆలోచన. అయితే పెదనాన్న కృష్ణంరాజు కోసం మాత్రం తన ఆలోచనలకు సవరణ ఇస్తున్నాడట. కృష్ణంరాజు తన గోపీ కృష్ణ సంస్థలో ప్రభాస్‌తో ఓ సినిమా చేయాలని ప్రణాళికలు సిద్ధం చేసుకొన్నారు. 'ఒక్క అడుగు' అనే స్క్రిప్టు కూడా సిద్ధంగానే ఉంది. 'బాహుబలి' కోసం ఈ చిత్రాన్ని వాయిదా వేశారు. ఇప్పుడు ఎలాగైనా సరే, ఈ సినిమాని పట్టాలెక్కించాలని కృష్ణంరాజు భావిస్తున్నారట.అందుకు ప్రభాస్ కూడా సిద్ధంగానే ఉన్నట్టు తెలుస్తోంది. 'బాహుబలి 2' షూటింగ్ జులైలో పూర్తయ్యే అవకాశాలున్నాయి. ఆ వెంటనే పెదనాన్న సినిమానే పూర్తి చేయాలన్నది ప్రభాస్ ఆలోచన. 'ఒక్క అడుగు'ని పక్కన పెట్టాల్సి వస్తే సుజిత్ సిద్ధం చేసుకొన్న కథని గోపీకృష్ణ సంస్థ ద్వారా సెట్స్‌పైకి తీసుకెళ్లాలని నిర్ణయించుకొన్నాడట. మొత్తానికి పెదనాన్న కోసం ఓ సినిమా చేయడం ఖాయమని... అది ఈ యేడాదే సెట్స్‌పైకి వెళ్తుందని చెప్పుకొంటున్నారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







