వైకుంఠ ద్వార దర్శనం టికెట్లు విడుదల చేసిన టీటీడీ

- December 11, 2020 , by Maagulf
వైకుంఠ ద్వార దర్శనం టికెట్లు విడుదల చేసిన టీటీడీ

తిరుమల:ఈనెల 25 నుండి జనవరి 3 వరకు వైకుంఠ ద్వారం నుండి తిరుమల శ్రీవారిని భక్తులు దర్శించుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఈరోజు శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం టికెట్లను విడుదల చేసింది. ప్రతి రోజు 20 వేల టికెట్లను అందుబాటులో ఉంచుతున్నారు. ఉదయం 6.30 గంటల నుంచి టికెట్లు టీటీడీ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి. ఈ ఏడాది పది రోజులపాటు వైకుంఠ ద్వార దర్శనం అవకాశం కల్పించనున్నారు. ఇందుకోసం ఆన్ లైన్ లో రోజుకు 20 వేల టికెట్లను విడుదల చేసింది.

రోజుకు 20 వేల టికెట్లను భక్తులకు విక్రయిస్తామని, ఆగమ శాస్త్ర నిపుణుల సలహాలు తీసుకున్న మీదటే 10 రోజుల పాటు వైకుంఠ ద్వారాలను తెరచివుంచాలన్న నిర్ణయం తీసుకున్నామని టీటీడీ అధికారులు స్పష్టం చేశారు. నేటి నుంచి ఆన్ లైన్ లో ఈ టికెట్లను బుక్ చేసుకోవచ్చని స్పష్టం చేశారు.

కాగా, వైష్ణవ సంప్రదాయాన్ని పాటిస్తూ ఎక్కువ‌మంది భ‌క్తుల‌కు వైకుంఠ ద్వార ద‌ర్శనం చేసుకోవాడానికి అనువుగా శ్రీవారి ఆల‌యంలోని వైకుంఠ ద్వారాన్ని ప‌ది రోజుల పాటు తెర‌చి ఉంచాల‌ని టీటీడీ నిర్ణయించింది. దీంతో డిసెంబ‌ర్‌ 25న వైకుంఠ ఏకాద‌శి కావడంతో ఆరోజు నుంచి 10 రోజుల పాటు వైకుంఠ ద్వారాన్ని తెరిచి భ‌క్తుల‌కు ద‌ర్శనభాగ్యం క‌ల్పిస్తారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com