అబుధాబి: జమ్మూకశ్మీర్ లో లులు గ్రూప్ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్

- December 11, 2020 , by Maagulf
అబుధాబి: జమ్మూకశ్మీర్ లో లులు గ్రూప్ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్

యూఏఈ:జమ్మూకశ్మీర్ లో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ను చేపట్టనున్నట్లు అబుధాబికి చెందిన సూపర్ మార్కెట్ గ్రూప్ సంస్థ లులు ప్రకటించింది. శ్రీనగర్ లో అందుకు తగిన అనువైన వాతావరణాన్ని తాము గుర్తించినట్లు...ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ద్వారా జమ్మూ కశ్మీర్ వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులకు ఊతం ఇవ్వనుందని సంస్థ చైర్మన్ యూసుఫలీ అభిప్రాయపడ్డారు. యూఏఈ పర్యటనలో ఉన్న జమ్మూకశ్మీర్ వ్యవసాయ శాఖ ప్రధాన కార్యదర్శి నవీన్ కుమార్ చౌదరీతో సమావేశమైన సందర్భంగా ఆయన ఈ ప్రకటన చేశారు. గతేడాది భారత ప్రధాని నరేంద్రమోదీ యూఏఈ పర్యటించిన వేళ తీసుకున్న సంకల్పం మేరకు జమ్మూ కశ్మీర్ వ్యావసాయ ఉత్పత్తులకు విస్తృత మార్కెట్ అవకాశాలను నెలకొల్పటంపై ఫోకస్ చేశామన్నారు. జమ్మూ యాపిల్, కుంకుమ పువ్వును తమ సూపర్ మార్కెట్ స్టోర్స్ ద్వారా యూఏఈ ప్రజలకు అందిస్తున్నామని వివరించారు. కోవిడ్ ఒడిదుడుకుల సమయంలోనూ ఇప్పటివరకు 400 టన్నుల యాపిల్స్ ని దిగుమతి చేసుకున్నట్లు తెలిపారు. శ్రీనగర్ లో ఏర్పాటు చేయాలనుకుంటున్న ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ద్వారా యూఏఈతో పాటు జీసీసీ దేశాలకు జమ్మూలో పండించే పళ్లు, కూరగాయలు, కుంకుమపువ్వు, తేనే, సుగంధ ద్రవ్యాల ఎగుమతికి మరిన్ని అవకాశాలు ఏర్పడనున్నాయి. లులు గ్రూప్ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటుకు అవసరమైన అన్ని సహయ సహాకారాలను అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు జమ్మూ కశ్మీర్ వ్యవసాయ ప్రధాన కార్యదర్శి నవీన్ చౌదరీ తెలిపారు. దుబాయ్ తో శ్రీనగర్ బంధం మరింత బలపడేలా నేరుగా ప్యాసింజర్ విమానాలను, కార్గో సర్వీసులను నడిపే అవకాశాలపై కూడా ఈ సందర్భంగా చర్చకు వచ్చాయి. ఈ సందర్భంగా కాన్సుల్ జనరల్ డాక్టర్ అమన్ పూరి మాట్లాడుతూ లులు గ్రూపును పలు కార్యక్రమాలను ప్రకటించినందుకు మరియు జె & కె ఎగుమతులను రెట్టింపు చేసే లక్ష్యాన్ని సాధించడంలో దీర్ఘకాలిక నిబద్ధత మరియు భాగస్వామ్యాన్ని అభినందించారు.లులు గ్రూప్ ఛైర్మన్ షు యూసుఫాలి ఎంఎకు కృతజ్ఞతలు తెలిపారు.జె & కెలో ఆయన చేసిన కార్యక్రమాలకు స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయి మరియు ఈ ప్రాంతం యొక్క ఆర్థిక అభివృద్ధికి దోహదం చేస్తుంది. జె & కె నుండి లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హాకు జె & కె నుండి యూఏఈకి ఇప్పటివరకు అతిపెద్ద ప్రతినిధి బృందాన్ని పంపినందుకు డాక్టర్ పూరి కృతజ్ఞతలు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com