ఏడాది పూర్తి కానున్న అమరావతి ఉద్యమం
- December 11, 2020
అమరావతి: అమరావతి రాజధాని రైతులు చేస్తున్న ఉద్యమం ఈనెల 17తో సంవత్సరం పూర్తి చేసుకోనుంది. ఈ నేపథ్యంలో వారు అమరావతి రాజకీయేతర ఐక్య కార్యాచరణ సమితి ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేసేందుకు ప్రణాళిక వేసుకుంది. రేపటి నుంచి ఆరు రోజుల పాటు వివిధ రూపాల్లో తమ నిరసనను వ్యక్తం చేయాలని నిర్ణయం తీసుకుంది.
తొలి రోజయిన రేపు మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు గుంటూరులో మహా పాదయాత్ర చేపట్టాలని నిర్ణయించింది. ఈ నెల 14న తుళ్లూరులో కిసాన్ సమ్మేళనాన్ని నిర్వహిస్తారు. ఈ నెల 15న విజయవాడలో రాజధాని పరిరక్షణ పాదయాత్రను చేస్తారు. చివరిరోజయిన ఈ నెల 17న ఉద్ధండరాయునిపాలెంలో బహిరంగ సభ ఏర్పాటు చేస్తారు. ఈ నెల 13, 16న కూడా నిరసనలు తెలుపుతారు. తమ ఉద్యమం ఇక్కడితో ఆగిపోదని, అమరావతిని ఏపి రాజధానిగా ప్రకటించే వరకు కొనసాగిస్తూనే ఉంటామని ఐకాస నేతలు స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు