నటుడిగా మంచి పేరు తెచ్చుకోవాలి - బ్రహ్మాజీ కొడుకు సంజయ్ రావు

- December 11, 2020 , by Maagulf
నటుడిగా మంచి పేరు తెచ్చుకోవాలి - బ్రహ్మాజీ కొడుకు సంజయ్ రావు

హైదరాబాద్:పిట్టా కథ తో మన అందరిని అలరించిన బ్రహ్మాజీ కొడుకు హీరో  సంజయ్ రావు ఇప్పుడు మరో మూడు సినిమాలతో బిజీ గా ఉన్నాడు. పిట్టా కథ లో మిడిల్ క్లాస్ అబ్బాయి గా నటించిన సంజయ్ ఇప్పుడు భిన్నమైనది పాత్రలతో మూడు భిన్న  చిత్రాలలో నటిస్తున్నాడు. రొమాంటిక్ హీరో గా, యాక్షన్ హీరో గా ఇలా సరికొత్త కథ, కథనం తో తెలుగు ప్రేక్షకులని అలరించడానికి త్వరలో వస్తున్నాడు మన సంజయ్ రావు. 

డాన్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ పతాకం పై నిర్మించబడుతున్న యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రం డిసెంబర్ రెండో వరం లో ప్రారంభం కానుంది. మరో రెండు చిత్రాలు 2021 జనవరి లో ప్రారంభం అవుతాయి. 

ఈ సందర్భంగా సంజయ్ రావు మాట్లాడుతూ "పిట్టా కథ సినిమా తో నన్ను ఆదరించిన తెలుగు ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు. ఇప్పుడు మరో   మూడు భిన్న చిత్రాలతో మీ ముందుకు వస్తున్నాను. మూడు డిఫరెంట్ సినిమాలే. ఒకటి రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ అయితే మరొకటి యాక్షన్  థ్రిల్లర్ ఇంకొకటి మర్డర్ మిస్టరీ చిత్రం. ఈ మూడు కథలు నాకు చాలా బాగా నచ్చాయి. ఈ రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రాన్ని డాన్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ వారు నిర్మిస్తున్నారు. డిసెంబర్ రెండో వరం లో షూటింగ్ ప్రారంభం అవుతుంది. మరో రెండు సినిమాలు 2021 జనవరి లో ప్రారంభం అవుతాయి. అలాగే నిత్య శెట్టి తో నేను ఒక వెబ్ సిరీస్ కూడా చేశాను. షూటింగ్ పూర్తీ అయ్యింది త్వరలోనే విడుదల అవుతుంది.

మా నాన్న బ్రహ్మాజీ వాళ్ళ నాకు మొదట్లో అవకాశం వచ్చిన దాన్ని నిలబెట్టుకునే చాన్సు నా టాలెంట్ మీదే ఉంది. నా టాలెంట్ చూసి నాకు అవకాశం ఇచ్చిన నా దర్శకనిర్మాతలకు ధన్యవాదాలు. కేవలం హీరోగానే కాదు, పెద్ద బడ్జెట్ సినిమాలో మంచి క్యారెక్టర్ వచ్చిన విలన్ గా అవకాశం వచ్చిన చేస్తాను" అని తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com