లైసెన్స్‌ లేకుండా కాస్మొటిక్‌ సర్వీస్‌: మహిళ అరెస్ట్‌

- December 11, 2020 , by Maagulf
లైసెన్స్‌ లేకుండా కాస్మొటిక్‌ సర్వీస్‌: మహిళ అరెస్ట్‌

బహ్రెయిన్: లైసెన్స్‌ లేకుండా కాస్మొటిక్‌ సర్వీసెస్‌ అందిస్తున్న ఓ మహిళను అరెస్ట్‌ చేసినట్లు ముహరాక్‌ పోలీసులు వెల్లడించారు. నిందితురాలు, కోవిడ్‌ ప్రోటోకాల్స్‌ని కూడా ఉల్లంఘించినట్లు అధికారులు పేర్కొన్నారు. మినిస్ట్రీ ఆఫ్‌ హెల్త్‌ సహకారంతో ఇన్వెస్టిగేషన్‌ చేస్తున్నట్లు ముహరాక్‌ గవర్నరేట్‌ పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌ డైరెక్టర్‌ జనరల& వెల్లడించారు. డైరెక్టరేట్‌కి అందించిన ఓ సమాచారం అనుగుణంగా సీక్రెట్‌ ఆపరేషన్‌ నిర్వహించి నిందితురాల్ని అరెస్ట్‌ చేసినట్లు అధికారులు తెలిపారు. ఆమె నుంచి కాస్మొటిక్‌ మెటీరియల్స్‌ అలాగే కొంత ఎక్విప్‌మెంట్‌ని స్వాధీనం చేసుకోవడం జరిగింది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com