మీర్జాపూర్ 2 ఇప్పుడు తెలుగులో

- December 11, 2020 , by Maagulf
మీర్జాపూర్ 2 ఇప్పుడు తెలుగులో

ముంబై: 2020 అక్టోబర్ 23న విడుదలై, క్షణాల్లోనే వీక్షకుల ఆదరాభిమానాలు చూరగొన్న అమెజాన్ ఒరిజినల్ సిరీస్ మీర్జాపూర్ సీజన్ 2 ఇప్పుడు భారతదేశవ్యాప్తంగా అభిమానుల కోసం తమిళం, తెలుగులో కూడా లభ్యమవుతోంది. డిసెంబర్ 11 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియో ఈ ప్రాంతీయ డబ్స్ ను అందిస్తోంది. విడు దలైన రోజునే ఇంటర్నెట్ ను కుదిపేసిన క్రైమ్ డ్రామా, రిలీజ్ అయిన వారంరోజుల్లోనే భారతదేశంలో ఈ సర్వీస్ పై అత్యంతగా వీక్షించబడిన షో గా మారింది. ప్రపంచవ్యాప్తంగా అభిమానులు సీజన్ 3 కోసం ఎదురుచూస్తున్నారు. 

ఇప్పటి వరకూ ఈ షో చూడని వారు ఇప్పుడు మీర్జాపూర్ లో తమ అభిమాన పాత్ర లను తమిళం, తెలుగులో చూసే అవకాశం లభించింది. భారత్ మరియు 200కు పైగా దేశాలు, టెరిటరీస్ లలో ప్రైమ్ సభ్యులు ఈ అత్యంత విజయవంతమైన భారతీయ క్రైమ్ థ్రిల్లర్ మీర్జాపూర్ సీజన్ 2 ను డిసెంబర్ 11 నుంచి ఎక్స్ క్లూజివ్ గా అమెజాన్ ప్రైమ్ వీడియోపై
తమిళం, తెలుగులో చూడవచ్చు.

పంకజ్ త్రిపాఠి, అలీ ఫజల్, దివ్యేందు శర్మ, శ్వేత త్రిపాఠి శర్మ, రసికా దుగల్, హర్షిత శేఖర్ గౌర్, ఇషా తల్వార్ లతో పాటుగా అమిత్ సియల్, విజయ్ వర్మ, యాంశుపైన్యూలి, అంజుమ్ శర్మ, షీబా చద్దా, మను రిషి చదా, రాజేశ్ తైలంగ్ ముఖ్యపాత్రల్లో నటించారు. ప్రపంచవ్యాప్తంగా ఈ షో నేటికీ భారీగా ప్రజాదరణ పొందుతోంది. ప్రాంతీయ భాషల్లో ఇది
అందుబాటులోకి రావడం ఈ సిరీస్ తో మరెంతో మంది మమేకం అయ్యేందుకు
తోడ్పడుతుంది.

ట్రైలర్ ను ఇక్కడ వీక్షించండి:
https://www.youtube.com/watch?v=xMKzdQrC5TI

కథాంశం: మీర్జాపూర్ కథాంశం అధికారం, రాజకీయం, ప్రతీకారానికి సంబంధించింది. కుట్రలు, కుతంత్రాలకు, ఒకరినొకరు మోసగించుకోవడాలకు సంబంధించింది. తుపాకులు మోస్తున్న వారు వాటిని ఉపయోగించేందుకూ వెనుకాడదు. ఈ సీజన్ మీర్జాపూర్ హింసాత్మక ప్రపంచానికి మాత్రమే పరిమితం కాదు. అది మనల్ని నాయకులకు, నేరగాళ్లకు మధ్య ఉండే బంధం ఉండే అధికార రాజకీయాల దిశగా తీసుకెళ్తుంది. అంతే గాకుండా మీర్జాపూర్ అవతలి భూభాగానికి కూడా మనల్ని తీసుకెళ్తుంది. అది తన సొంత హింసాత్మక, శక్తివంతమైన కుటుంబాలను కలిగిఉంటుంది. అవి వివిధ అక్రమ వ్యాపారాలను చేస్తుంటాయి. మీర్జాపూర్ మహిళలు మరింత శక్తివంతంగా, సంక్లిష్టంగా మారుతారు. తమ లక్ష్యాలను సాధించుకునేందుకు దేన్ని ఉపయోగించుకునేందుకైనా వారు వెనుకాడరు. చివరికి ఎవరు గెలుస్తారు ?
త్రిపాఠీలను సవాల్ చేసేందుకు ఒక్కరైనా మిగులుతారా ? ఈ సీజన్ లో ఈ కాన్వాస్ మరింత పెద్దదైపోయింది. నిబంధనలు మాత్రం అవే. రక్తం చిందించనిదే నీవు అక్కడ బతకలేవు!

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com