పబ్లిక్ ఫార్మసీలో మందుల పక్కదారి..ఇద్దరు ఫార్మసిస్టుల అరెస్ట్
- December 11, 2020
మనామా:ప్రజలకు అందాల్సిన మందులను పక్కదారి పట్టించారు ఇద్దరు ఫార్మాసిస్టులు. దాదాపు 38 వేల బహ్రెయిన్ దినార్స్ విలువైన టాబ్లెట్లను పక్కదారి పట్టించారు. అయితే..దొంగతనం చాన్నాళ్లు ఆగదు కదా..! మనోళ్ల బండారం కూడా అధికారుల తనిఖీల్లో బయటపడింది. బహ్రెయిన్ లోనే అతిపెద్ద పబ్లిక్ ఫార్మసి అయిన సల్మానియా మెడికల్ కాంప్లెక్స్ ఫార్మసీలో ఈ చోరీ చోటు చేసుకుంది. ఫార్మసీలో పని చేసే ఇద్దరు ఫార్మసిస్టులు..తమ ఇంటికి, బంధువులకు, తెలిసిన వారి కోసం ప్రభుత్వ ఫార్మసీ నుంచి టాబ్లెట్లను ఎత్తుకెళ్లేవారు. అలాగే ఏకంగా 38 వేల బహ్రెయిన్ దినార్ల విలువ చేసే 2,44,000 ప్రిస్కిప్షన్ మందులను దొంగిలించారు. ఫార్మసీలో ఉద్యోగాలను అడ్డుగా పెట్టుకొని ప్రజా సంపదను దోచుకోవటంతో పాటు ప్రభుత్వ విధుల పట్ల బాధ్యతారాహిత్యంగా వ్యవహరించినందుకు అరెస్ట్ చేసిన అధికారులు..వారిని క్రిమినల్ ఉన్నత న్యాయస్థానం ముందు హజరు పరిచారు.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు