గీతాంజలి-వంశీ జాతీయ పురస్కారం-2020

- December 11, 2020 , by Maagulf
గీతాంజలి-వంశీ జాతీయ పురస్కారం-2020

ప్రముఖ సినీనటి జమునా రమణారావుకు గీతాంజలి-వంశీ జాతీయ పురస్కారం-2020స్వర్గీయ గీతాంజలి పేరుమీద నెలకొల్పిన ‘గీతాంజలి-వంశీ జాతీయపురస్కారం-2020’ ప్రజానటి, కళాభారతి, మాజీ పార్లమెంటు సభ్యురాలు డా॥ జమునా రమణారావుకు 12 డిసెంబర్‌, 2020 శనివారం సాయంత్రం 6 గంటలకు (భారత కాలమానం) అంతర్జాలంలో బహూకరించబోతున్నట్లు వంశీ గ్లోబల్‌ అవార్డ్స్‌ వ్యవస్థాపక అధ్యక్షులు శిరోమణి డా॥ వంశీ రామరాజు, దక్షిణాఫ్రికా తెలుగు సాహిత్య వేదిక (దక్షిణాఫ్రికా) వ్యవస్థాపకులు రాపోలు సీతారామరాజు, శారదా కళాసమితి వ్యవస్థాపకులు డోగిపర్తి శంకరరావు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పూర్వ ఉపసభాపతి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర శాసనసభ మండలి బుద్ధప్రసాద్‌, రేలంగి నరసింహారావు (సినీ దర్శకులు), భువనచంద్ర (సినీ గేయరచయిత), డా॥ కె.వి. కృష్ణకుమారి (రచయిత్రి), సినీ విజ్ఞానవిశారద ఎస్‌.వి. రామారావు పాల్గొంటారు. గీతాంజలి కుమారుడు, సినీనటుడు జి. శ్రీనివాస్‌ జ్యోతి ప్రకాశనం చేస్తారు. కాకినాడ సుచిత్ర వ్యాఖ్యాతగా వ్యవహరించే తెలుగు పాటకు పట్టాభిషేకం సినీ సంగీత విభావరిలో వి.కె. దుర్గ, కాజా శరత్‌బాబు గానం చేయనున్నారు. గుంటూరుకు చెందిన లక్ష్మీ శ్రీనివాస్‌ రామరాజు వీణపై గీతాంజలి నటించిన చిత్రం నుంచి ఒక గీతం వినిపిస్తారు. హైదరాబాద్‌ పబ్లిక్‌ స్కూల్‌ విద్యార్థిని అనఘదత్త రామరాజు ప్రార్థనాగీతం ఆలపిస్తారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com