సౌదీలో కరోనా తగ్గుముఖం...కొన్నాళ్లుగా 200లోపే పాజిటివ్ కేసులు

- December 12, 2020 , by Maagulf
సౌదీలో కరోనా తగ్గుముఖం...కొన్నాళ్లుగా 200లోపే పాజిటివ్ కేసులు

రియాద్:సౌదీ అరేబియాలో కరోనా తీవ్రత తగ్గుముఖం పడుతున్నట్లు కనిపిస్తోంది. కొన్నాళ్లుగా ఇక్కడ ఒక్కరోజులో 200 లోపే పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కింగ్డమ్ పరిధిలో 168 పాజిటివ్ కేసులు మాత్రమే నమోదయ్యాయి. దీంతో కొత్తగా వైరస్ బారిన పడుతున్న వారి సంఖ్య గణనీయంగా తగ్గుతూ వస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. లేటెస్ట్ గా నమోదైన పాజిటివ్ కేసులతో కలిపి కింగ్డమ్ పరిధిలో ఇప్పటివరకు 3,59,583 మంది వైరస్ బారిన పడినట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. గడిచిన 24 గంటల్లో కరోనా కారణంగా మరో 11 మంది మరణించటంతో... మృతుల సంఖ్య 6,023కి పెరిగింది. ఇదిలాఉంటే...వైరస్ బారిన పడుతున్న వారి సంఖ్యతో పోలీస్తే రికవరి రేటు పెరుగుతుండటం కూడా ఊరటనిచ్చే అంశం. 24 గంటల్లో 168 పాజిటివ్ కేసులు వస్తే...248 మంది వైరస్ బారి నుంచి కోలుకున్నట్లు ఆరోగ్య శాఖ వివరించింది. ఇప్పటివరకు 3,50,108 మంది వైరస్ నుంచి కోలుకున్నట్లు తెలిపింది. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com