ఫేక్‌ డేటింగ్‌ వెబ్‌సైట్ల మాయలో పడొద్దు: దుబాయ్‌ పోలీస్‌

- December 12, 2020 , by Maagulf
ఫేక్‌ డేటింగ్‌ వెబ్‌సైట్ల మాయలో పడొద్దు: దుబాయ్‌ పోలీస్‌

దుబాయ్‌:ఆన్‌లైన్‌ డేటింగ్‌ ప్లాట్‌ఫామ్స్‌ ద్వారా ముప్పు వాటిల్లే అవకాశముందంటూ దుబాయ్‌ పోలీస్‌ హెచ్చరించడం జరిగింది. ఈ మేరకు ట్విట్టర్‌ ద్వారా ఓ వీడియో విడుదల చేశారు దుబాయ్‌ పోలీసులు. స్కామర్స్‌ కొత్త విధానాల ద్వారా అమాయకుల్ని బురిడీ కొట్టిస్తున్నారని పోలీసులు తెలిపారు. డేటింన వెబ్‌సైట్ల ద్వారా అమాయకుల్ని గుర్తించి, వారిని ట్రాప్‌లోకి లాగుతున్నారని తెలిపిన పోలీసులు, లైసెన్సు లేకుండా సీక్రెట్‌ మసాజ్‌ సెంటర్లను ఏర్పాటు చేసి, వాటి ద్వారా అసాంఘీక కార్యకలాపాలకు పాల్పడుతున్న వైనం, తద్వారా మోసాలకు దిగుతున్న వైనం గురించి సవివరంగా తెలిపారు. కాగా, దుబాయ్‌లో ఈ తరహా గ్యాంగ్‌లను 40 వరకు పట్టుకున్నారు అధికారులు. మహిళల ప్రొఫైల్స్‌తో అమాయకులకు నిందితులు వల వేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. సీక్రెట్‌ వీడియోలతో బ్లాక్‌మెయిలింగ్‌కి కూడా దిగుతున్నారు నిందితులు.  

--బాలాజీ(మాగల్ఫ్ ప్రతినిధి,యూఏఈ)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com