ఇతరులను కించపరిచేలా వ్యవహరిస్తే 6 నెలల జైలు, Dh5000 ఫైన్

- December 12, 2020 , by Maagulf
ఇతరులను కించపరిచేలా వ్యవహరిస్తే 6 నెలల జైలు, Dh5000 ఫైన్

అబుధాబి: ఇతరులను కించపరిచేలా వ్యహరించటం, మాట్లాడటం యూఏఈ ఫెడరల్ పీనల్ కోడ్ ప్రకారం నేరమని ఆ దేశ పబ్లిక్ ప్రాసిక్యూషన్ వెల్లడించింది. ఫోన్ లోగానీ, వ్యక్తిగతంగా, లేఖలతో గానీ ఓ వ్యక్తిని కించపరిచేలా వ్యాఖ్యలు చేస్తే యూఏఈ చట్టాల ప్రకారం గరిష్టంగా ఆరు నెలల జైలు శిక్ష, 5 వేల దిర్హాముల వరకు జరిమాన ఉంటుందని పబ్లిక్ ప్రాసిక్యూషన్ తన సోషల్ మీడియాలో హెచ్చరిస్తూ ఓ వీడియో క్లిప్పింగ్ ను విడుదల చేసింది. ఫెడరల్ పీనల్ కోడ్ లోని ఆర్టికల్ 374 ప్రకారం కించపరిచేలా వ్యాఖ్యలు చేయటం నేరమనే విషయంపై అవగాహన కల్పించేందుకు ఈ మేరకు వీడియో రిలీజ్ చేసింది. ఇతర వ్యక్తులను కించపర్చటంతో పాటు ప్రభుత్వ ఉద్యోగులను తమ విధులను నిర్వహిస్తున్న సమయంలో వారిని కించపరిచేలా వ్యవహరించినా, వ్యాఖ్యలు చేసినా ఇదే శిక్ష పడుతుందని హెచ్చరించింది. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com