కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోవటం తప్పనిసరేం కాదు..ప్రజలకు సౌదీ స్పష్టత
- December 12, 2020
రియాద్:కోవిడ్ 19కి విరుగుడుగా అందుబాటులోకి వచ్చిన ఫైజర్-బయోన్టెక్ వ్యాక్సిన్ అందరూ ఖచ్చితంగా తీసుకోవాలని తామేం నిబంధనలు పెట్టడం లేదని సౌదీ అరోగ్య శాఖ స్పష్టత ఇచ్చింది. స్వచ్ఛదంగా ముందుకు వచ్చిన వారికి మాత్రమే వ్యాక్సిన్ ఇస్తామని వెల్లడించింది. అయితే ఆరోగ్య శాఖ సిబ్బంది మరీ ముఖ్యంగా కోవిడ్ పేషెంట్లను ట్రీట్ చేసే వారు మాత్రం వ్యాక్సిన్ వేయించుకోటం శ్రేయస్కరమని అభిప్రాయపడింది. సౌదీ ఆహార, ఔషధ నియంత్రణ అధికార విభాగం..గత వారమే ఫైజర్ వ్యాక్సిన్ ఆమోదం తెలుపటంతో అతి త్వరలోనే కింగ్డమ్ కు వ్యాక్సిన్ చేరే అవకాశాలు ఉన్నాయి. అయితే..వ్యాక్సిన్ రాగానే ప్రజలకు ఇవ్వబోమని..ప్రతీ బ్యాచ్ లో వ్యాక్సిన్ ను ముందుగా పూర్తిగా విశ్లేషించిన తర్వాతే ఇస్తామని ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. ఫైజర్ వ్యాక్సిన్ సురక్షితమని చెప్పటంలో తమకు ఎలాంటి అనుమానం లేదని, అయితే..ప్రజల్లో మాత్రం వ్యాక్సిన్ దుష్ఫ్రభావాలకు దారితీస్తుందనే ఆందోళన ఉన్నమాట నిజమేనని వెల్లడించింది. అందుకే ప్రజలకు నమ్మకం కలిగిలే ముందుగానే ప్రతి బ్యాచ్ లో వ్యాక్సిన్ శాంపిల్ ను పరిశీలిస్తామని వివరించింది. అంతేకాదు...ఏడాదికి ముందు వ్యాక్సిన్ కు సంబంధించి క్లినికల్ ట్రయల్స్, సైడ్ ఎఫెక్ట్స్, తుది ఆమోదం గురించి సాధారణ ప్రజలకు తెలిసేది కాదని వెల్లడించింది. కానీ, కోవిడ్ నేపథ్యంలో వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్, వ్యాక్సిన్ వివరాలపై ప్రజలకు పూర్తి అవగాహన ఉందని తెలిపారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో పార్కింగ్ సమస్యకు పరిష్కారం..!!
- దుబాయ్ పోలీసుల నిజాయితీకి ప్రశంసలు..!!
- సౌదీ అరేబియాలో భారీ తనిఖీలు..!!
- ఒంటెల ఆరోగ్యంపై అంతర్జాతీయ సదస్సు.. 12 మంది ప్రముఖులకు తుంబే గ్రూప్ సత్కారం
- తెలంగాణ ఆడబిడ్డలకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్, కేసీఆర్
- యూఏఈలో విద్యా సంస్థల స్థాపకుడు భారతీయ ఎన్ఆర్ఐ కన్నుమూత
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!







