డిసెంబర్ 23 నుంచి ఖతార్ లో పంటల మహా సంత మహసీల్ ఫెస్టివల్
- December 12, 2020
ఖతార్: వ్యవసాయ క్షేత్రాల నుంచి తాజా పళ్లు, కూరగాయాలు, ఇతర ఉత్పత్తులతో ఏర్పాటు చేసే పంటం పండగ మహసీల్ ఫెస్టివల్ మళ్లీ ప్రజల ముందుకు రానుంది. ఈ నెల 23 నుంచి జనవరి 2 వరకు మహసీల్ ఫెస్టివల్ నిర్వహించనున్నట్లు కల్చరల్ విలేజ్ ఫౌండేషన్-కతార స్పష్టం చేసింది. ఖతార గ్రామీణ వ్యవసాయ ఉత్పత్తులతో ఫెస్టివల్ నిర్వహించటం వరుసగా ఇది ఐదో ఏడాది కావటం విశేషం. డిసెంబర్ 23 నుంచి ప్రారంభం అయ్యే ఫెస్టివల్ ప్రతి రోజు ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఉంటుందని కతార వెల్లడించింది. అంతేకాదు..మార్చి 31 వరకు ప్రతి గురు, శుక్ర, శనివారాల్లో కూడా మహసీల్ ఫెస్టివల్ కొనసాగుతుందని వివరించింది. స్థానికంగా పండించే పళ్లు, కూరగాయలతో 40 స్టాల్స్ ఏర్పాటు చేయనున్నట్లు, ఖతారీ తేనే, ఖర్చూరలు, ఇతర ఆహార ఉత్పత్తులతో మరో 27 స్టాళ్లను ఏర్పాటు చేస్తున్నట్లు కతార స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష