కువైట్:పర్యావరణ పరిక్షణ ప్రాతిపదికనే గోడౌన్లు, స్టోరేజ్ ఏరియాల అనుమతి
- December 13, 2020
కువైట్ సిటీ:గోడౌన్లు, స్టోరేజ్ ప్రాంతాలకు అనుమతి ఇవ్వటంలో ఇక నుంచి పర్యావరణ పరిరక్షణ అంశాలకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని కువైట్ అధికార యంత్రాంగం సమాలోచనలు జరిపింది. అనుమతులకు సంబంధించి ఇండస్ట్రీ అథారిటీ ప్రతినిధులతో జరిగిన సమావేశంలో పర్యావరణ పరిరక్షణ అధికార విభాగం...ఈ విషయాన్ని బలంగా ప్రస్తావించింది. గోడౌన్లు, స్టోరేజ్ ఏరియాలకు అనుమతుల విషయంలో కొంత కాలంగా నిర్లక్ష్య ధోరణి కనిపిస్తోందని, పర్యావరణ పరిక్షణకు పాటించాల్సిన ప్రమాణాలకు తగినట్లుగా అన్ని అంశాలను పరిగణలోకి తీసుకున్నాకే అనుమతులు ఇవ్వాలని సూచించింది. అలాగే గ్యారేజ్ లు కార్ వాష్రూంల విషయంలోనూ పర్యావరణ అవసరాలకు సంబంధించిన అంశాలను కూడా ఈ సమావేశంలో ప్రస్తావించింది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







