ఒమన్ లో తగ్గుతున్న కోవిడ్ ఎఫెక్ట్...మాస్క్ ల పట్ల ప్రజల్లో నిర్లక్ష్యం
- December 13, 2020
మస్కట్:ఒమన్ ప్రజల్లో కోవిడ్ పట్ల స్పష్టమైన చైతన్యం కనిపిస్తోందని...అయితే ఫేస్ మాస్కుల విషయంలో మాత్రం కొందరు ఇంకా నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తున్నారని రాయల్ ఒమన్ పోలీసులు వెల్లడించారు. ఇటీవలి కాలంలో ఒమన్ లో నిబంధనల ఉల్లంఘన కేసులు తగ్గుతుండటం సంతోషకరమైన విషయమే అయినా..నమోదైవుతున్నా కొద్ది కేసుల్లో ఎక్కువ శాతం ఫేస్ మాస్క్ ఉల్లంఘనులే ఉన్నారని వివరించారు. తాము విధించిన జరిమానాల్లో పబ్లిక్ ప్రాంతాల్లో మాస్కులు లేకుండా తిరుగుతున్న వారే ఎక్కువ శాతం ఉన్నారని అన్నారు. ఆ తర్వాత కొన్ని తిరిగి ప్రారంభమైన కొన్ని సంస్థలకు నిబంధనలు ఉల్లంఘించినట్లు తెలిపారు. ఇదిలాఉంటే..ఒమన్ వ్యాప్తంగా కొద్ది కాలంగా కోవిడ్ తీవ్రత తగ్గుముఖం పట్టిందని వ్యాధి నియంత్రణ అధికార విభాగం తెలిపింది. కొన్ని నెలలుగా నమోదవుతున్న కొత్త కేసులను విశ్లేషించుకుంటే కోవిడ్ కేసుల సంఖ్య 26 శాతం నుంచి 4 శాతానికి పడిపోయిందని స్పష్టత ఇచ్చింది. అయితే..దేశీయంగా, అంతర్జాతీయంగా కోవిడ్ ఇన్ఫెక్ట్ కేసుల్లో హెచ్చుతగ్గులు ఉంటాయని, అందుకే తాము ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించుకుంటూ అవసరమైన చర్యలు చేపడుతున్నామని వివరించింది. కోవిడ్ ప్రభావం ఎప్పుడు ఎలా ఉంటుందో ఖచ్చితంగా చెప్పలేం కనుక...వ్యాపార రంగంలో సంక్షోభం ఇంతటితో ముగిసిపోతుందని కూడా తాము భావించటం లేదని వెల్లడించింది.
--లెనిన్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఒమన్)
తాజా వార్తలు
- Asia Cup 2025: Gautam Gambhir changes handshake protocol after Pakistan match
- తెలంగాణ నుంచి మరో 2 వందేభారత్ రైళ్లు
- జీఎస్టీ 2.0పై సీఎం చంద్రబాబు స్పందన..
- కొత్త కారు కొనేవాళ్లకు ఇక పండగే అంటున్న భారత ప్రభుత్వం
- ముగ్గురు ఆసియన్లపై బహ్రెయిన్ లో విచారణ ప్రారంభం..!!
- సీజింగ్ వాహనాలు వేలం..సౌమ్ అప్లికేషన్ ద్వారా బిడ్డింగ్..!!
- ఒమన్ లో ఆరుగురు అరబ్ జాతీయులు అరెస్టు..!!
- జెడ్డా ఆకాశంలో నిప్పులుగక్కిన ఫైటర్ జెట్స్..!!
- కువైట్ లో ట్రాఫిక్ చట్టాలపై అవగాహన..!!
- ఆన్లైన్ పిల్లల లైంగిక వేధింపులు..188 మంది అరెస్టు..!!