అబుధాబి టోల్ గేట్ సిస్టమ్ లో అకౌంట్ యాక్టివేట్ చేసుకున్న 70,000 మంది వాహనదారులు
- December 13, 2020
అబుధాబి:అబుధాబిలో టోల్ గేట్ సిస్టమ్ ను ప్రకటించిన వారంలోనే వాహనదారుల నుంచి చెప్పుకోదగ్గ స్పందన కనిపించింది. ఇప్పటివరకు మొత్తం 70 వేల మంది వాహనదారులు తమ అకౌంట్లను యాక్టివేట్ చేసుకున్నట్లు అబుధాబిలోని సమీకృత రవాణా కేంద్రం(ఇంటిగ్రేటెడ్ ట్రాన్స్ పోర్ట్ సిస్టమ్) అధికారులు వెల్లడించారు. వాహనదారులు చూపిన చొరవకు ట్విట్టర్ ద్వారా ధన్యవాదాలు తెలిపారు.
అబుధాబిలోని నాలుగు బ్రిడ్జిల మీదుగా ప్రయాణించే వాహనాలకు టోల్ గేట్ సిస్టమ్ అమలు చేస్తున్నట్లు ప్రకటించిన ఐటీసీ..టోల్ ఫీజులను జనవరి 2 నుంచి అమల్లోకి తీసుకొస్తున్నట్లు గత శనివారమే ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో వాహనదారులు అంతా టోల్ గేట్ అకౌంట్లను రిజిస్టర్ చేసుకొవాలని, గతంలోనే రిజిస్టర్ చేసుకున్న వారు అకౌంట్లను యాక్టివేట్ చేసుకోవాలని కోరింది. ఐటీసీ నుంచి ప్రకటన వెలువడిన వారంలోనే 70 వేల మంది డర్బ్ ద్వారా తమ అకౌంట్లను యాక్టివేట్ చేసుకున్నారు.
టోల్ గేట్ సిస్టమ్ యాక్టివేట్ చేసుకోని వారు https://darb.itc.gov.ae ద్వారాగానీ, డర్బ్ యాప్ ద్వారాగానీ వాహన యజమానులు టోల్ గేట్ అకౌంట్లను యాక్టీవేట్ చేయించుకోవాలని అధికారులు సూచించారు. డర్బ్ అకౌంట్ రిజిస్ట్రేషన్ కోసం Dh100 చెల్లించాల్సి ఉంటుంది. ఇందులో Dh50 బ్యాలెన్స్ రూపంలో వాహనదారుడి ఖాతాలో జమ అవుతుంది. టోల్ ఛార్జీని Dh4గా నిర్ధారించారు.
--సుమన్(మాగల్ఫ్ ప్రతినిధి,అబుధాబి)
తాజా వార్తలు
- ఎయిర్ ఇండియా ఫ్లైట్: ప్రయాణికుడు చేసిన పనికి హడలి పోయిన పైలట్..
- న్యూఢిల్లీలో IEC వార్షిక సమావేశంలో పాల్గొన్న ఖతార్..!!
- పాలస్తీనాను గుర్తించిన యూకే, కెనడా, ఆస్ట్రేలియా, పోర్చుగల్..!!
- యూఏఈలో ఆన్లైన్ ఫుడ్ డెలివరీలను నిషేధించిన స్కూల్స్..!!
- నివాస ప్రాంతాలలో బ్యాచిలర్ హౌసింగ్.. కఠిన చర్యలు..!!
- మసాజ్ పార్లర్ల ద్వారా మనీలాండరింగ్..!!
- స్వదేశానికి తిరిగి వచ్చిన సయ్యిద్ బిలారబ్..!!
- షేక్ హ్యాండ్ ఇద్దాం రండీ..టీమ్ఇండియా ఆటగాళ్లను కోరిన గంభీర్
- తెలంగాణ నుంచి మరో 2 వందేభారత్ రైళ్లు
- జీఎస్టీ 2.0పై సీఎం చంద్రబాబు స్పందన..