విలక్షణ నటీమణి గీతాంజలి
- December 13, 2020
వంశీ గ్లోబల్ అవార్డ్స్ ఇండియా దక్షిణాఫ్రికా తెలుగు సాహిత్య వేదిక, శారదా కళాసమితి విజయవాడ సంయుక్త ఆధ్వర్యంలో అంతర్జాలంలో డిసెంబర్ 12వ తేదీన ప్రజా నటి, కళాభారతి డాక్టర్ జమునా రమణా రావుకు స్వర్ణయుగ సినీనటి గీతాంజలి - వంశీ జాతీయ పురస్కారం -- 2020 ప్రదానం చేశారు... ఆ సందర్భంగా పురస్కార గ్రహీత జమునా రమణా రావు మాట్లాడుతూ, "గీతాంజలి మహానటి సావిత్రి తర్వాత తనకెంతో ఆప్తురాలనీ, ఒకరకంగా గీతాంజలి కూడా మహానటి కోవకు చెందినదే అనీ తమకంటే ఆమె దేనిలోనూ తక్కువ కాదనీ, తన 13ఏళ్ల వయసులోనే ఎన్టీ రామారావు నిర్మించిన సీతారామ కళ్యాణం లో సీతగా నటించి నిజంగా సీత అంటే ఇలాగే ఉండేది కాబోలు అనుకునే విధంగా మాలాంటి నటీమణులను కూడా తన్మయత్వం లో ముంచిన ఒక విలక్షణ నటి" అని ప్రశంసించారు..గీతాంజలి పేర స్థాపించిన మొట్టమొదటి అవార్డు తాను స్వీకరించడం ఆనందంగా ఉంది అన్నారు.
ఈ సందర్భంగా కార్యక్రమంలో పాల్గొన్న మండలి బుద్ధప్రసాద్ పూర్వ ఉపసభాపతి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర శాసనసభ, రేలంగి నరసింహారావు ప్రముఖ సినీ దర్శకులు, భువనచంద్ర ప్రముఖ సినీ గేయ రచయిత, డాక్టర్ కె.వి కృష్ణకుమారి ప్రముఖ రచయిత్రి, సినీ విజ్ఞాన విశారద ఎస్ వి రామారావు, శారదాకళాసమితి అధ్యక్షులు డోగిపర్తి శంకర్రావు, దక్షిణాఫ్రికా తెలుగు సాహిత్య వేదిక ఉపాధ్యక్షులు గౌతమలింగ, వంశీ అధ్యక్షురాలు డాక్టర్ తెన్నేటి సుధాదేవి, వంశీ మేనేజింగ్ ట్రస్టీ శైలజా సుంకరపల్లి, వంశీ వ్యవస్థాపకులు శిరోమణి డాక్టర్ వంశీ రామరాజు పాల్గొన్నారు.. ఈ కార్యక్రమాన్ని గీతాంజలి కుమారుడు జి శ్రీనివాస్ జ్యోతి ప్రకాశనం చేసి ప్రారంభించారు.. తన తల్లి పేర అవార్డు స్థాపించి డా. జమున కు ప్రదానం చేయడం తమ కుటుంబానికి ఎంతో సంతోషం కలిగించిందని అన్నారు.. గీతాంజలి పేర నెలకొల్పిన ఈ పురస్కారాన్ని స్వీకరించడానికి అంగీకరించిన డాక్టర్ జమున కు అందరూ అభినందనలు తెలియజేశారు.. కాకినాడ సుచిత్ర వ్యాఖ్యానంతో " తెలుగు పాటకు పట్టాభిషేకం" అనే సినీ సంగీత విభావరిలో వి కే దుర్గ, కాజా శరత్ బాబు గీతాలను ఆలపించి రంజింపజేశారు.. ఈ కార్యక్రమానికి రామరాజు కుటుంబానికి చెందిన లక్ష్మీ శ్రీనివాస్ రామరాజు వీణపై "శ్రీ సీతారాముల కళ్యాణం" గీతాన్ని వినిపించారు.. అంతేకాకుండా రామంతపూర్ పబ్లిక్ స్కూల్ విద్యార్థిని ప్రార్థన గీతం జయ జయ జయ ప్రియ భారత జనయిత్రీ ఆలపించారు..
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు