కోవిడ్ వ్యాక్సిన్ సినోఫార్మ్ కు బహ్రెయిన్ అనుమతి

- December 13, 2020 , by Maagulf
కోవిడ్ వ్యాక్సిన్ సినోఫార్మ్ కు బహ్రెయిన్ అనుమతి

మనామా:కోవిడ్ వ్యాక్సిన్ సినోఫార్మ్ కు తాము అధికారికంగా ఆమోదం తెలుపుతున్నట్లు నేషనల్ హెల్త్ రెగ్యూలేటరీ అథారిటీ స్పష్టం చేసింది. జీ24 హెల్త్ కేర్  వ్యాక్సిన్ కు సంబంధించి అన్ని డాక్యుమెంట్లను సమర్పించిందని..వాటిని పరిశీలించిన తర్వాత వ్యాక్సిన్ కు తాము అనుమతి ఇస్తున్నట్లు ఎన్.హెచ్.ఆర్.ఏ వెల్లడించింది. పలు దేశాల్లో ఇప్పటికే సినోఫార్మ్ విజయవంతంగా క్లినికల్ ట్రయల్స్ నిర్వహించిందని, వాటికి సంబంధించిన అన్ని ఫలితాలను తాము విశ్లేషించి వ్యాక్సిన్ వినియోగానికి సమ్మతం తెలిపినట్లు వివరించింది. మూడో దశ ప్రయోగంలో భాగంగా మొత్తం 42,299 మందిపై ట్రయల్స్ నిర్వహించామని...ఇందులో యాంటీబాడీలను న్యూట్రలైజ్ చేసి వంద శాతం ఫలితాలను సినోఫార్మ్ సాధించిందని తెలిపింది. ఇక బహ్రెయిన్ కూడా సినోఫార్మ్ క్లినికల్ ట్రయల్స్ లో భాగస్వామ్యం అయిన విషయం కూడా తెలిసిందే. దాదాపు ఏడు వేల మందిపై ఈ వ్యాక్సిన్ ప్రయోగించారు. 

--రాజేశ్వర్(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com