గవర్నర్ బండారు దత్తాత్రేయ‌కు తృటిలో తప్పిన ప్రమాదం

- December 14, 2020 , by Maagulf
గవర్నర్ బండారు దత్తాత్రేయ‌కు తృటిలో తప్పిన ప్రమాదం

తెలంగాణ:హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయకు పెద్ద ప్రమాదం తప్పింది. హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై నల్గొండ జిల్లా చౌటుప్పల్ మండలం కైతాపురం వద్ద ఆయన ప్రయాణిస్తున్న వాహనం అదుపు తప్పి రహదారి పక్కకు దూసుకెళ్లింది. ప్రమాద సమయంలో కారులో దత్తాత్రేయతో పాటు ఆయన వ్యక్తిగత సహాయకుడు, డ్రైవర్ ఉన్నారు. ఈ ప్రమాదంలో ఆయన సహాయకుడికి స్వల్ప గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం అతడిని హైదరాబాద్‌కు తరలించారు. అనంతరం వేరే వాహనంలో దత్తాత్రేయ సూర్యాపేట వెళ్లారు. విషయం తెలుసుకున్న చౌటుప్పల్ ఏసీపీ సత్తయ్య, ఇన్‌స్పెక్టర్ వెంకన్నలు సంఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com