నా డైమండ్ చెవిపోగు పోయింది..ఎవరైనా హెల్ప్ చేయండి: జూహీ చావ్లా
- December 14, 2020
బాలీవుడ్ సీనియర్ నటి జూహీచావ్లా చెవిపోగో పోగొట్టుకుంది. అది మామూలు చెవిపోగు కాదు. ఏకంగా డైమండ్ చెవిపోగునే పోగోట్టుకోవడం గమనార్హం. ఈ విషయాన్ని జూహీ చావ్లా ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. ప్లీజ్ హెల్ప్ చేయండి అంటూ పోస్ట్ పెట్టింది. అంతేకాదు దాని ఫోటోని పంచుకుంది. ఆమె చెబుతూ, నేను ముంబయి అంతర్జాతీయ విమానాశ్రయంలో టీ 2 నుంచి గేట్ 8 వైపు నడుస్తుండగా, నా వజ్రాల చెవిపోగు జారి పడిపోయింది. నాకు ఎమిరేట్స్ కౌంటర్, సెక్యూరిటీ ఇమ్మిగ్రేషన్ వద్ద తనిఖీ చేశారు ఆ సమయంలో అది కనిపించకుండాపోయింది. దయజేసి నా చెవిపోగు కనుగొనడంలో ఎవరైనా సహాయం చేయగలిగితే వారికి బహుమతి ఇస్తానని తెలిపింది. .
గత 15ఏళ్లుగా ఆ డైమండ్ రింగ్‌ని ధరిస్తున్నట్టు తెలిపింది. దయజేసి నా వజ్రపు చెవి పోగు దొరికితే పోలీసులకు లేదా తనకు చెప్పండ`ని పేర్కొంది. ఈ సందర్భంగా అభివాదం చేసే ఎమోజీలను పంచుకుంది. తన మ్యాచింగ్ ఇయరింగ్ స్నాప్ షాట్ ను ను నెటిజన్లతో పంచుకున్నారు. దీంతో ఇప్పుడు ఎయిర్‌పోర్ట్ అధికారులతోపాటు నెటిజన్లు దాన్ని కనిపెట్టే పనిలో బిజీ అయ్యారు. మరి ఈ డైమండ్ చెవిపోగు దొరుకుతుందేమో చూడాలి.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







