గవర్నర్ బండారు దత్తాత్రేయకు తృటిలో తప్పిన ప్రమాదం
- December 14, 2020
తెలంగాణ:హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయకు పెద్ద ప్రమాదం తప్పింది. హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై నల్గొండ జిల్లా చౌటుప్పల్ మండలం కైతాపురం వద్ద ఆయన ప్రయాణిస్తున్న వాహనం అదుపు తప్పి రహదారి పక్కకు దూసుకెళ్లింది. ప్రమాద సమయంలో కారులో దత్తాత్రేయతో పాటు ఆయన వ్యక్తిగత సహాయకుడు, డ్రైవర్ ఉన్నారు. ఈ ప్రమాదంలో ఆయన సహాయకుడికి స్వల్ప గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం అతడిని హైదరాబాద్కు తరలించారు. అనంతరం వేరే వాహనంలో దత్తాత్రేయ సూర్యాపేట వెళ్లారు. విషయం తెలుసుకున్న చౌటుప్పల్ ఏసీపీ సత్తయ్య, ఇన్స్పెక్టర్ వెంకన్నలు సంఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు