నేషనల్‌ డే: ఎ380 విమానాన్ని బహ్రెయిన్‌కి నడపనున్న ఎమిరేట్స్‌

- December 14, 2020 , by Maagulf
నేషనల్‌ డే: ఎ380 విమానాన్ని బహ్రెయిన్‌కి నడపనున్న ఎమిరేట్స్‌

బహ్రెయిన్: ఎమిరేట్స్‌, ప్రత్యేకంగా ఎ380 విమాన సర్వీసుని డిసెంబర్‌ 15న బహ్రెయిన్‌కి నడపనుంది. బహ్రెయిన్‌ నేషనల్‌ డే సెలబ్రేషన్స్‌ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. బహ్రెయిన్‌లో నేషనల్‌ హాలీడేస్‌ నేపథ్యంలో పెరిగిన ప్రయాణీకుల డిమాండ్‌కి అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. దుబాయ్‌లో సాయంత్రం 4.05 నిమిషాలకు బయల్దేరి, బహ్రెయిన్‌కి 4.25 నిమిషాలకు చేరుకుంటుంది. సాయంత్రం 5.45 నిమిషాలకు బహ్రెయిన్‌లో బయల్దేరి, దుబాయ్‌కి రాత్రి 8 గంటలకు చేరుకోనుంది. ఎమిరేట్‌ వినియోగదారులు బహ్రెయిన్‌ నుంచి వచ్చే క్రమంలో వారికి కాంప్లిమెంటరీ కోణంలో పిసిఆర్‌ టెస్ట్‌ని చేస్తారు. బహ్రెయిన్‌ - దుబాయ్‌ మధ్య 6 మిలియన్‌ ప్రయాణీకులు ఇప్పటిదాకా ప్రయాణించినట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఎమిరేట్స్‌ 20వ ఏనివర్సరీ జరుపుకుంటోంది బహ్రెయిన్‌లో తమ తొలి విమాన సర్వీసు ప్రారంభించినప్పటినుంచి.  

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com