ఈ నెల 18న నందు హారర్ థ్రిల్లర్ 'ఐందవి' విడుదల
- December 14, 2020
హైదరాబాద్:నందు హీరోగా నటించిన కొత్త సినిమా 'ఐందవి'. హారర్ థ్రిల్లర్ కథతో ఈ సినిమా తెరకెక్కించారు దర్శకుడు ఫణిరామ్ తుఫాన్. సన్నీ అండ్ విన్నీ సినిమాస్ పతాకంపై శ్రీధర్ లింగం నిర్మించారు. అనురాధ నాయికగా నటించిన ఈ చిత్రంలో ఛత్రపతి శేఖర్, దిలీప్, అవంతిక ఇతర కీలక పాత్రలు పోషించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న 'ఐందవి' సినిమా ఈ నెల 18న థియేటర్ లలో విడుదలకు సిద్ధమవుతోంది.
ఈ సందర్భంగా నిర్మాత శ్రీధర్ లింగం మాట్లాడుతూ....లాక్ డౌన్ ముందే మా సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. థియేటర్లు లేకపోవడంతో ఇన్నాళ్లూ ఆగాం. సినిమాను థియేటర్ లో చూస్తే వచ్చే అనుభూతి వేరు. అందుకే కొంత ఆలస్యమైనా మంచి థియేటర్ లలో ఐందవి సినిమాను విడుదల చేస్తున్నాం. హారర్ థ్రిల్లర్ కథతో సినిమా సాగుతుంది. జన సంచారం లేని ప్రాంతంలో సరదాగా కొన్ని రోజులు గడుపుదామని ఆరుగురు వ్యక్తులు వెళ్తారు. ఆ ప్రాంతంలో వారు ఒకరి తర్వాత ఒకరు హత్యలకు గురవుతారు. ఆ హత్యలు చేసిందెవరు, ఐందవికి ఈ హత్యలకు సంబంధం ఏంటి అనేది కథాంశంగా ఉంటుంది. సవారి సినిమా తర్వాత నందు ఫర్మార్మెన్స్ బాగా చేసిన చిత్రమిది. అన్నారు.
ఈ చిత్రానికి సంగీతం - ఎస్ఏ ఆర్మాన్, సినిమాటోగ్రఫీ - భరత్ సి కుమార్, సమర్పణ - రాజేశ్వరి తుమ్మల
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో 108 మంది ప్రభుత్వ ఉద్యోగుల అరెస్ట్..!!
- సూడాన్ విద్యార్థుల ఫీజులు తిరిగి చెల్లించండి..షార్జా రూలర్ ఆదేశాలు..!!
- కువైట్ సిటీలో రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో అగ్నిప్రమాదం..!!
- పిల్లల రక్షణకు యూనిసెఫ్‌తో సహకారం కొనసాగిస్తాం: ఒమన్
- అనారోగ్యంతో ఉన్న పిల్లలను స్కూల్‌కు పంపొద్దు..!!
- కువైట్‌లో నివాస సముదాయంపై డ్రోన్ దాడి.. తప్పిన ప్రాణనష్టం
- భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ
- ఓవర్‌టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!
- మస్కట్‌లో వీధుల పేర్లు, చిరునామాల ధృవీకరణ 80 శాతం పూర్తి..!!
- ఇరాన్ డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్న బహ్రెయిన్ వాయు రక్షణ వ్యవస్థ







