బహ్రెయిన్ లో విదేశీయులకు సెల్ఫ్ స్పాన్సర్ షిప్ వీసా...
- December 15, 2020
మనామా:స్పాన్సర్లు ఎవరూ లేకుండా విదేశీయులు, ప్రవాసీయులు బహ్రెయిన్ లో సొంతంగా వీసా పొందటం ఎలా? ఏయే నిబంధనలు పాటించాలి? ఏయే డాక్యుమెంట్లు కావాలి? కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకుంటే రిటైర్డ్ అయిన ప్రవాసీ ఉద్యోగులు, బహ్రెయిన్ లో ఆస్తులు కొన్న విదేశీయులు, పెట్టుబడులు పెట్టిన విదేశీయులు సులువుగానే సెల్ఫ్ స్పాన్సర్ షిప్ వీసాలను పొందవచ్చు. సెల్ఫ్ స్పాన్సర్ షిప్ వీసా పొందాలనుకునే వారు స్వయంగా కానీ, అతని తరపు న్యాయ ప్రతినిధిగానీ జాతీయ పాస్ పోర్టు, రెసిడెన్సీ అఫైర్స్ కార్యాలయంలో హాజరవ్వాల్సి ఉంటుంది. రెండేళ్ల కాలపరిమితి ఉన్న సెల్ఫ్ స్పాన్సర్ షిప్ కోసం BD200, నాలుగేళ్లకు BD400, పదేళ్లకు BD600 చెల్లించాల్సి ఉంటుంది. దరఖాస్తు ఫారమ్ కోసం BD4 చెల్లించాలి. అయితే...ప్రభుత్వ, ప్రైవేట్ రంగంలో ఉద్యోగం చేస్తున్న వారు మాత్రం సెల్ఫ్ స్పాన్సర్ షిప్ వీసా దరఖాస్తుకు అనర్హులు. ఇక రిటైర్డ్ ఉద్యోగులు, ఆస్తులున్న విదేశీయులు, విదేశీ ఇన్వెస్టర్ లు సెల్ఫ్ స్పాన్సర్ షిప్ వీసా దరఖాస్తు చేసుకునేందుకు అవసరమైన డాక్యుమెంట్లు ఇవి.
రిటైర్డ్ ఉద్యోగులకు అవసరమైన డాక్యుమెంట్లు :
-----------------------------------------
- సర్వీస్ రిక్వెస్ట్ ఫామ్, సరైన పాస్ పోర్టు కాపీ, గుర్తింపు కార్డు, సత్ప్రవర్తన కలిగినట్లు సర్టిఫికెట్
- అద్దెకు ఉంటున్నట్లు చేసుకున్న ఒప్పందం కాపీ లేదంటే విద్యుత్ బిల్లు
- బహ్రెయిన్ లేదా జీసీసీ దేశాల పరిధిలోని కంపెనీలో సర్వీసు నుంచి పదవీ విరమణ పొందినట్లు సర్టిఫికెట్. 15 ఏళ్లకు తగ్గకుండా పని చేసిన వారై ఉండాలి. అలాగే 55 ఏళ్లు అంతకు మించిన వయసున్నవారై ఉండాలి.
- గడువు ముగియని ఆరోగ్య బీమా సర్టిఫికెట్ తో పాటు అతని, అతని కుటుంబ సభ్యుల పోషణకు నెలవారి ఆదాయ మార్గాలకు సంబంధించిన వివరాల జాబితా
- దరఖాస్తుదారుడి గుర్తింపు కార్డు లేదంటే అతని తరపు న్యాయ ప్రతినిధి గుర్తింపు కార్డు
బహ్రెయిన్ లో ఆస్తులు కలిగిన విదేశీయులకు అవసరమైన డాక్యుమెంట్లు:
----------------------------------------------------------------
- సర్వీస్ రిక్వెస్ట్ ఫామ్, సరైన పాస్ పోర్టు కాపీ, గుర్తింపు కార్డు, సత్ప్రవర్తన కలిగినట్లు సర్టిఫికెట్
- దరఖాస్తు చేసుకునే విదేశీ వ్యక్తికి బహ్రెయిన్ లో ప్రాపర్టీ ఉన్నట్లు తెలిపే ధృవపత్రాలు, ఆస్తి విలువ BD50,000కి తక్కువ కాకుండా ఉండాలి. ప్రాపర్టీ ఖచ్చితంగా పర్యాటక ప్రాంతాల్లోనే ఉండాలి. అలాగే విద్యుత్ బిల్లు జతపర్చాలి.
- గడువు ముగియని ఆరోగ్య బీమా సర్టిఫికెట్
- అతని, అతని కుటుంబ సభ్యుల పోషణకు నెలవారి ఆదాయ మార్గాలకు సంబంధించిన వివరాల జాబితా(నెల ఆదాయం BD500 కంటే తగ్గకూడదు)
- దరఖాస్తుదారుడి గుర్తింపు కార్డు లేదంటే అతని తరపు న్యాయ ప్రతినిధి గుర్తింపు కార్డు
విదేశీ పెట్టుబడిదారులకు అవసరమైన డాక్యుమెంట్లు:
----------------------------------------------
- సర్వీస్ రిక్వెస్ట్ ఫామ్, సరైన పాస్ పోర్టు కాపీ, గుర్తింపు కార్డు, సత్ప్రవర్తన కలిగినట్లు సర్టిఫికెట్
- అద్దెకు ఉంటున్నట్లు చేసుకున్న ఒప్పందం
- BD 1,00,000కి తగ్గకుండా ఏదైనా కంపెనీలో షేర్లు ఉన్నట్లు ధృవపరిచే డాక్యుమెంట్లు
- బహ్రెయిన్ జారీ చేసిన ఆరోగ్య బీమా సర్టిఫికెట్ తో పాటు అతని, అతని కుటుంబ సభ్యుల పోషణకు నెలవారి ఆదాయ మార్గాలకు సంబంధించిన వివరాల జాబితా(నెల ఆదాయం BD500 కంటే తగ్గకూడదు)
- దరఖాస్తుదారుడి గుర్తింపు కార్డు లేదంటే అతని తరపు న్యాయ ప్రతినిధి గుర్తింపు కార్డు
తాజా వార్తలు
- సెయింట్ లూయిస్ ఫుడ్ బ్యాంక్లో ‘NATS’ సేవలు
- మోసగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆర్ఓపి హెచ్చరిక..!!
- Metrash ద్వారా రెసిడెన్స్ పర్మిట్ పునరుద్ధరించే విధానం..!!
- డ్రోన్ దాడిలో దెబ్బతిన్న ప్రాంతాలను పరిశీలించిన ఆర్థిక మంత్రి..!!
- భారీ బడ్జెట్ తో స్మార్ట్ క్లాస్రూమ్ ప్రాజెక్ట్ ను ప్రారంభించిన ISB..!!
- అరఫా డే, ఈద్ అల్ అదా..లాంగెస్ట్ పబ్లిక్ హాలీడే..!!
- సౌదీ అరేబియాలో పలు ప్రాంతాలలో భారీ వర్షాలు..!!
- చెన్నై పై ఆర్సీబీ ఘనవిజయం
- గ్లోబల్ స్పోర్ట్స్ హబ్ గా తెలంగాణ: సీఎం రేవంత్
- పాన్ కార్డు కొత్త రూల్స్..









