సూపర్ స్టార్ రజనీకాంత్ పార్టీ పేరు.. సింబల్ సిద్దం

- December 15, 2020 , by Maagulf
సూపర్ స్టార్ రజనీకాంత్ పార్టీ పేరు.. సింబల్ సిద్దం

చెన్నై:తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ఇటీవల రాజకీయ అరంగేట్రం చేస్తున్నంటూ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా రజనీకాంత్‌ పార్టీ పేరు, గుర్తులను ఖరారు చేసినట్టు తెలుస్తోంది. గత కొన్ని రోజులుగా వీటిపై కసరత్తు చేస్తూ వచ్చిన రజనీకాంత్ వీటి విషయంలో ఎట్టకేలకు ఓ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. పార్టీ పేరును ‘మక్కల్ సేవై కర్చీ’ గా నామకరణం చేసినట్టు తెలుస్తోంది. అలాగే, పార్టీ గుర్తుగా ఆటోను ఎంచుకున్నట్టు సమాచారం. ఈ నెలాఖరున ఈ రెండింటిపై ప్రకటన చేసే అవకాశం ఉందని ఆ పార్టీ నేతల ద్వారా తెలుస్తోంది.

నిజానికి రజనీకాంత్ తన పార్టీ గుర్తుగా ‘బాబా లోగో’ ను కోరారని, అయితే, ఎన్నికల సంఘం దానిని తిరస్కరించిందని సమాచారం. దీంతో ఆటో గుర్తును కోరగా దానిని కేటాయించినట్టు తెలుస్తోంది. ఈ నెల 31న రజనీకాంత్ స్వయంగా ఈ విషయాన్ని వెల్లడిస్తారని అభిమానులు, పార్టీ నాయకులు చెబుతున్నారు. కాగా పార్టీకి చీఫ్ కోఆర్డినేటర్‌గా అర్జున మూర్తిని సూపర్ వైజర్‌గా తమిళ్రూవి మణియనణ్‌లను నియమించుకున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com